BigTV English

Taman out from ‘Guntur Karam’ : ‘గుంటూరు కారం’ నుండి తమన్ ఔట్.. ఇన్‌డైరెక్ట్‌గా పోస్టులు..

Taman out from ‘Guntur Karam’ : ‘గుంటూరు కారం’ నుండి తమన్ ఔట్.. ఇన్‌డైరెక్ట్‌గా పోస్టులు..
Taman out from 'Guntur Karam'


Taman out from ‘Guntur Karam’ : సినీ పరిశ్రమలో మనస్పర్థలు అనేవి సహజం. అది డైరెక్టర్, హీరో మధ్య అయినా కావచ్చు లేదా హీరో, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య కూడా కావచ్చు. మామూలుగా కొందరు డైరెక్టర్లకు ప్రత్యేకంగా కొందరు మ్యూజిక్ డైరెక్టర్లతో స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అందుకే వారి ప్రతీ సినిమాలో ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తుంటారు. అలాగే త్రివిక్రమ్ కూడా ‘గుంటూరు కారం’లో తమన్‌కు అవకాశం ఇచ్చాడు. కానీ ఈ విషయంలో అనేక మనస్పర్థలు తలెత్తుతున్నాయని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

మహేశ్ బాబు చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉంటుందో అని ఆందోళన చెందిన ఫ్యాన్స్‌కు టైటిల్ గ్లింప్స్.. ఫుల్ మీల్స్‌ను అందించింది. చాలాకాలం తర్వాత మహేశ్.. ఈ సినిమా కోసం స్కోకింగ్ చేస్తూ కనిపించాడు. బీడీ తాగుతూ మహేశ్.. మాస్ లుక్‌లో కనిపించే సరికి ఇది పక్కా ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా ‘గుంటూరు కారం’ అనే టైటిల్ కూడా ఘాటుగా ఉందంటూ ఉత్సాహాన్ని బయటపెట్టారు.


‘గుంటూరు కారం’ కోసం మ్యూజిక్ డైరెక్టర్‌గా ముందు నుండి అనిరుధ్‌ను తీసుకోవాలనే ఆలోచనలో మహేశ్ ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా సీన్‌లోకి తమన్ ఎంటర్ అయ్యాడు. తమన్.. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం మహేశ్‌కు ముందు నుండే ఇష్టం లేదని కూడా సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపించాయి. అయితే ట్యూన్స్ అందించడంలో ఆలస్యం చేయడం వల్ల తమన్‌ను ఈ సినిమా నుండి తొలగించారని, అనిరుధ్ లేదా జీవి ప్రకాశ్.. గుంటూరు కారం కోసం ట్యూన్స్ తయారు చేస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో తమన్.. సోషల్ మీడియా పోస్టులు కూడా ఆడియన్స్‌లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

తమన్ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే.. తనపై ఎవరో కడుపుమంటతో రగిలిపోతున్నారు అని అర్థం వచ్చేలా ఉన్నాయి. ముందుగా ‘బనానా కడుపు మంటకు మంచిది’ అంటూ బనానా ఫోటోను పోస్ట్ చేశాడు తమన్. ఆ తర్వాత వెంటనే ‘నేను రేపటినుండి స్టూడియోలో ఫ్రీగా బటర్ మిల్క్ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నాను. కడుపుమంట ఉన్నవారు వెల్‌కమ్. చాలా పని ఉంది. నా టైమ్ వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు. మీది కూడా వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. గుంటూరు కారం నుండి తమన్‌ను తొలగించారు కాబట్టే తను ఇలా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తున్నాడని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×