BigTV English

Jagan : జగనన్న ఆణిముత్యాలు .. విద్యార్థులకు అవార్డులు ప్రదానం..

Jagan : జగనన్న ఆణిముత్యాలు .. విద్యార్థులకు అవార్డులు ప్రదానం..


CM jagan live program today(Breaking news in Andhra Pradesh): జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో టాపర్స్‌ను విజయవాడలో సీఎం జగన్ సన్మానించారు. విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, నగదు బహుమతి అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. కరిక్యులమ్‌ కూడా మారిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి తీసుకొచ్చామనని చెప్పారు.

విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నామని జగన్ వివరించారు. ప్రతీ ఒక్కరూ కనీసం డిగ్రీ చదవాలన్నదే ప్రభుత్వంగా పేర్కొన్నారు. అందుకే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు చేపట్టామన్నారు. విద్యార్థులకు టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.


చదువులో ప్రతిభ చూపించిన విద్యార్ధులను ఏపీ ప్రభుత్వం నగదు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. పదో తరగతిలో స్టేట్ ఫస్ట్‌ ర్యాంకర్‌కు లక్ష , సెకండ్ ర్యాంకర్ కు రూ.75 వేలు, థర్డ్ ర్యాంకర్ కు రూ. 50 వేలు ప్రొత్సాహకం అందిస్తోంది. ఈ ఏడాది 42 మందిని ఎంపిక చేసింది. జిల్లా స్థాయిలో నగదు పురస్కారాలు ఇస్తోంది. పదోతరగతి టాపర్ కు రూ.50, వేలు, సెకండ్ ర్యాంకర్ కు రూ.30 వేలు, థర్డ్ ర్యాంకర్ కు రూ.15 వేలు ఇస్తోంది. నియోజకవర్గ స్థాయి, పాఠశాల స్థాయిలో నగదు పురస్కారాలు అందిస్తోంది.

రాష్ట్రస్థాయి గ్రూపుల వారీగా ఇంటర్ టాపర్స్‌కు రూ. లక్ష చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం చేసింది. జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50 వేల చొప్పున మొత్తం 391 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. నియోజకవర్గ స్థాయిలో టాపర్స్‌కు రూ.15 వేల చొప్పున 662 మందికి ప్రదానం చేస్తోంది. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతోపాటు సర్టిఫికేట్, మెడల్‌ అందజేసున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×