Roja on Pawan Kalyan: అల్లు అర్జున్ కు ఒక న్యాయం. పవన్ కళ్యాణ్ కు ఒక న్యాయమా.. మేము ఒప్పుకోము. ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ కావాల్సిందే అంటున్నారు ఆ పార్టీ నేతలు. మానవత్వం మీకు ఉందా.. లేదా.. ఉంటే ఇంకా ఎందుకు పరామర్శించలేదు? అల్లు అర్జున్ పై ఏ చర్యలు తీసుకున్నారో, అవే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబులు డిమాండ్ చేస్తున్నారు.
రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్ కు వచ్చి తిరుగు ప్రయానమైన ఇద్దరు యువకులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాకినాడ జిల్లాకు చెందిన మణికంఠ, చరణ్ లు బైక్ పై వచ్చి, స్వగ్రామానికి వెళ్తూ ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షలు, హీరో రామ్ చరణ్ రూ. 5 లక్షలు, నిర్మాత దిల్ రాజు రూ. 5 లక్షలు ప్రకటించారు. అలాగే ప్రమాదం జరగడం దురదృష్టకరమని వారు అభిప్రాయ పడ్డారు. అయితే ఈ ఘటన లక్ష్యంగా వైసీపీ రివర్స్ అటాక్ ప్రారంభించింది.
తాజాగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి, మాజీ మంత్రి రోజా సీరియస్ ట్వీట్ చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరమన్న రోజా, తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కనీసం పరామర్శించ లేదన్నారు. హైదరాబాద్ లో జరిగిన సంధ్య థియేటర్ ఘటనను ఉదహరించిన రోజా.. హీరో అల్లు అర్జున, పుష్ప టీమ్ మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ ఇప్పుడు 3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమన్నారు.
ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా? పరామర్శించకపోగా వీరి మరణానికి గత ప్రభుత్వం రోడ్డు వేయకపోవడం కారణమంటూ చౌక బారు రాజకీయం చేయడం తగదని రోజా అన్నారు. 7 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వమే కదా..? 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరు కాదా..? అంటూ రోజా ప్రశ్నించారు. రోడ్డు వల్ల చనిపోతే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా..? మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోండని పవన్ కు సూచించారు.
Also Read: tella Ship – Kakinada Port: 55 రోజుల రచ్చ.. ఎట్టకేలకు ఆఫ్రికా వైపుకు స్టెల్లా షిప్..
అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడ ఓ ట్వీట్ చేశారు. పుష్ప కేమో నీతులు చెప్తారా.. గేమ్ చేంజర్ కి పాటించరా అంటూ ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకొని అంబటి ట్వీట్ చేయగా, అక్కడ జరిగిన ఘటన వేరు, ఇక్కడ జరిగింది వేరంటూ మెగా అభిమానులు రిప్లై ఇస్తున్నారు. మొత్తం మీద సందట్లో సడేమియా మాదిరిగా, గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరుగు ప్రయాణంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరమైనప్పటికీ, ఆ సాకు చూపి వైసీపీ చేస్తున్న నిర్వాకంపై జనసేన అభిమానులు ఫైర్ అవుతున్నారట.