Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) మరోసారి లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకుంది. ఇప్పటికే తన లైఫ్ పై వచ్చిన డాక్యుమెంటరీ వల్ల ధనుష్ (Dhanush) తో వివాదం కొనసాగుతుండగా, తాజాగా ‘చంద్రముఖి’ మేకర్స్ ఆమెకు షాక్ ఇచ్చారు. ‘చంద్రముఖి’ (Chandramukhi) నిర్మాతలు నయన్ పై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
నయనతార (Nayanthara) లైఫ్ కి సంబంధించి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యిందో గానీ, ఆమెకు వరుసగా చిక్కులు తెచ్చిపెడుతోంది. డాక్యుమెంటరీ రిలీజ్ కాగానే నయనతార, ధనుష్ మధ్య వివాదం భగ్గుమంది.
నయనతార (Nayanthara) భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ రూపొందించిన సినిమా ‘నేను రౌడీనే’ మూవీ క్లిప్ ని ఈ డాక్యుమెంటరీ లో ఉపయోగించడం వల్ల వివాదం మొదలైంది. అందులో నయనతార స్వయంగా హీరోయిన్ గా నటించగా, ధనుష్ నిర్మతగా వ్యవహరించారు. అయితే తన అనుమతి లేకుండా ఈ సినిమాలోని క్లిప్స్ ని నయనతార డాక్యుమెంటరీ లో వాడుకున్నందుకు 10 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఇటు నయనతారకు, అటు నెట్ ఫ్లిక్స్ (Netflix) కు లీగల్ నోటీసులు పంపించాడు ధనుష్.
దీంతో నయన్ (Nayanthara) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ధనుష్ పై ఫైర్ అయ్యింది. కొన్ని సెకన్ల వీడియోను వాడుకున్నందుకు 10 కోట్లు చెల్లించాలా? మీలాగా నాకేవరూ సపోర్ట్ లేరు. ఇండస్ట్రిలో స్వశక్తితో ఎదిగాను, చట్ట ప్రకారంగానే ఎదుర్కొంటాను అని ఘాటు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కోర్టులో ఉండగానే, తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన మరో హిట్ సినిమా ‘చంద్రముఖి’ టీం కూడా ఇదేవిధంగా స్పందించింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, జ్యోతిక నయనతార హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ హర్రర్ మూవీ ‘చంద్రముఖి’ (Chandramukhi). 2005 లో రిలీజ్ అయిన ఈ హిట్ మూవీ నయన్ కెరీర్ లో కీలక మైలురాయి అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలోని క్లిప్ ను తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో ఉపయోగించారు అంటూ ‘చంద్రముఖి’ నిర్మాతలు తాజాగా నయనతారకు, నెట్ ఫ్లిక్స్ కు కూడా లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు కాపీరైట్ చట్టానికి విరుద్ధంగా కంటెంట్ ను ఉపయోగించుకున్నందుకు గాను 5 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం.
అయితే ధనుష్ (Dhanush) వివాదంలో సోషల్ మీడియా వేదికగానే కాకుండా, ఓ ఇంటర్వ్యూలో కూడా స్పందించింది నయనతార. మరి ఇప్పుడు ‘చంద్రముఖి’ టీంకి ఆమె ఎలాంటి సమాధానం చెబుతుంది ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నయనతార చిన్నప్పుడు విషయాలనే కాకుండా పెళ్లి, పిల్లల వరకు ఆమె లైఫ్ మొత్తాన్ని చూపించారు. మరి ఈ డాక్యుమెంటరీ నయనతారకి ముందు ముందు ఇంకెన్ని చిక్కులు తెచ్చి పెడుతుందో చూడాలి.