Game Changer :సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతైతే ఉంటారో.. మార్క్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే అభిమానులు కూడా అంతకు మించి ఉంటారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ తో పోల్చుకుంటే, నార్త్ ఆడియన్స్ మాస్ ఎలిమెంట్స్ ను ఎంతలా ఇష్టపడతారో పుష్ప 2 (Pushpa 2) ఫలితమే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.1800 కోట్లు కలెక్షన్స్ వసూలు చేయగా.. ఒక్క హిందీ నుండే దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీన్ని బట్టి చూస్తే మాస్ ఎలిమెంట్స్ కి నార్త్ ఆడియన్స్ ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నార్త్ ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకునే భారం రామ్ చరణ్ (Ram Charan) పై కూడా పడిందని తెలుస్తోంది.
రామ్ చరణ్ పై పుష్ప2 ఒత్తిడి..
అసలు విషయంలోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నార్త్ ఆడియన్స్ పై పెద్దగా ప్రభావం చూపడం లేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ అన్నింటినీ గమనిస్తే.. సినిమాకి కావలసిన మాస్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు. వీటిని బట్టి చూస్తే ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను మెప్పించడం కష్టమే అన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ సినిమాలు హిందీ రాష్ట్రాలలో కూడా బాగా ఆడాలని అనుకుంటున్నారు. కానీ నార్త్ వాళ్ళకి మాస్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉంటేనే అక్కడివారు ఆదరిస్తారు. ఇప్పుడు అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా మారింది. ఎందుకంటే పుష్ప 2 హిందీ రాష్ట్రాలలో రూ.800కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఒత్తిడి కూడా గేమ్ ఛేంజర్ ద్వారా రామ్ చరణ్ పై కూడా ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా నార్త్ ఆడియన్స్ మెప్పిస్తుందో లేదో తెలియదు కానీ పుష్ప 2 కలెక్షన్లు దాటడం కష్టమే అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలా అయితే రామ్ చరణ్ తన సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టంగా మారుతుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే జనవరి 10 వరకు ఎదురు చూడాల్సిందే.
గేమ్ ఛేంజర్ సినిమా విశేషాలు..
గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక క్యారెక్టర్ లో ప్రభుత్వ ఉద్యోగిగా, మరొక క్యారెక్టర్ లో పొలిటిషన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani), టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali )హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో ఒక్కసారి నిర్వహించగా, ఏపీలోని రాజమహేంద్రవరంలో జనవరి 4వ తేదీన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఇంటికి తిరిగి వెళుతున్న అభిమానులలో ఇద్దరు బైక్ యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే మరణించగా.. చిత్ర నిర్మాత దిల్ రాజు(Dilraju), ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పాటు చిత్ర హీరో రామ్ చరణ్(Ram Charan) కూడా తమవంతుగా ఒక్కొక్కరు రూ.5లక్షల చొప్పున ఒక్కో కుటుంబానికి పరిహారం ప్రకటించారు.