Stella Ship – Kakinada Port: సీజ్ ద షిప్ అన్న ఒకే ఒక్క మాటతో జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచిన స్టెల్లా షిప్, ఎట్టకేలకు ఆఫ్రికాకు బయలుదేరింది. కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణా జోరుగా సాగుతుందన్న విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నేరుగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి సందర్శించిన విషయం కూడా వార్తల్లో నిలిచింది.
స్టెల్లా షిప్ ద్వార అక్రమ రేషన్ బియ్యం రవాణా సాగుతుందన్న ఆరోపణలతో, కాకినాడ పోర్టు గురించి జాతీయస్థాయిలో చర్చ సాగింది. ఈ నేపథ్యంలో స్టెల్లాషిప్ ను పోర్టులోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది నవంబర్ 11న కాకినాడ తీరానికి వచ్చిన స్టిల్లా షిప్, వివాదాలకు కేంద్ర బిందువుగా మారగా జిల్లా కలెక్టర్ స్వయంగా షిప్ ను సందర్శించి బియ్యం అక్రమ రవాణా సాగుతుందా లేదా అనే విషయంపై విచారణ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడ కాకినాడలో పర్యటించిన సమయంలో, స్టెల్లా షిప్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
AP Scheme: ఏపీలో మరో స్కీమ్.. ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ..!
గత 55 రోజులుగా కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా షిప్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కాకినాడ కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టెల్లా నౌక సోమవారం ఆఫ్రికాకు బయలుదేరింది. కొన్ని వారాలపాటు అధికారుల తర్జనభర్జనల తర్వాత, షిప్ కు మోక్షం లభించిందని చెప్పవచ్చు. అయితే రేషన్ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండ ప్రత్యేక సిట్ అధికారులను నియమించి, రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏదిఏమైనా కాకినాడ పోర్ట్ వ్యవహారంతో రాష్ట్రంలో, అక్రమ రేషన్ రవాణాకు చెక్ పడిందని చెప్పవచ్చు.