BigTV English

App That Recognize Skin Cancer : చర్మ సమస్యల నుండి క్యాన్సర్ వరకు.. అన్నీ కనిపెట్టే యాప్..

App That Recognize Skin Cancer  : చర్మ సమస్యల నుండి క్యాన్సర్ వరకు.. అన్నీ కనిపెట్టే యాప్..


App That Recognize Skin Cancer : చర్మానికి సంబంధించి అనేక వ్యాధులతో పాటు చర్మ క్యాన్సర్ కూడా ఈమధ్య ఎక్కువమందిని ఇబ్బంది పెడుతోంది. పైగా ప్రపంచంలోనే కామన్‌గా ఉన్న క్యాన్సర్‌లలో స్కిన్ క్యాన్సర్ కూడా ఒకటని తెలుస్తోంది. అందుకే ఈ క్యాన్సర్‌ను ముందస్తుగా కనిపెట్టడం కోసం, దీనికి వెంటనే చికిత్సను అందించడం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పలు స్కిన్ వ్యాధులతో పాటు క్యాన్సర్‌ను కూడా కనిపెట్టడం కోసం వారు ఒక యాప్‌ను తయారు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా చర్మ వ్యాధుల వల్ల, క్యాన్సర్ వల్ల బాధపడుతున్న వేలమందికి సాయంగా ఉండడం కోసం ఒక కొత్త డెర్మటాలజీ యాప్ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో పేషెంట్ల వ్యాధిని కనిపెట్టడం దగ్గర నుండి ట్రీట్మెంట్ వరకు అన్ని ప్రక్రియలు వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే యూకేలో ఈ యాప్‌కు సంబంధించిన ట్రయల్స్ మొదలయ్యాయి. యూకే వ్యాప్తంగా 18 నెలల్లో 60 శాతం స్కిన్ క్యాన్సర్ గురించి భయపడుతున్న వారికి సాయంగా ఉంది ఈ యాప్. అంతే కాకుండా వారిది స్కిన్ క్యాన్సర్ కాదని స్పష్టం చేసి డాక్టర్ల పని తగ్గించింది.


ముందుగా ఈ యాప్.. స్కిన్ క్యాన్సర్ అని భయపడుతున్న వారికి అది క్యాన్సరా కాదా అని కన్ఫర్మ్ చేసి చెప్తుంది. అందుకే ఇది అందుబాటులోకి వస్తే.. ఎంతోమందికి స్కిన్ క్యాన్సర్ ఉందన్న అనుమానం నుండి బయటపడేస్తుంది. చాలాసార్లు చర్మంపై వచ్చే ర్యాష్‌ను, మొటిమను, మచ్చను క్యాన్సర్ అని అపోహ పడుతుంటారు. కానీ ఈ యాప్‌లో ఉండే జీపీ.. దానిని స్కాన్ చేసి అది క్యాన్సారా కాదా అని చెప్పగలదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అప్పుడు వారు స్పెషలిస్ట్‌ను కలవాలా వద్దా అని నిర్ధారించుకోవచ్చు.

చర్మానికి సంబంధించి అన్ని విధాలుగా సహాయపడే ఈ యాప్ పేరు ‘స్మార్ట్ రిఫరెల్స్’. ముందుగా ఈ యాప్‌లో చర్మం ఫోటో తీసిన తర్వాత, ఇది వెంటనే ఆ ఫోటోను స్పెషలిస్ట్ దగ్గరకు పంపిస్తుంది. 48 గంటల్లోపు వారు దానిని స్టడీ చేసి దాని గురించి సమాచారాన్ని యూజర్‌కు అందిస్తారు. ఇప్పటికే యూకేలో ట్రయల్ మొదలుపెట్టుకున్న ఈ యాప్ ఇప్పటికే దాదాపు 1.5 మిలియన్ పేషెంట్లను ట్రీట్ చేసినట్టు తెలుస్తోంది. చర్మ క్యాన్సర్ కంటే క్యాన్సర్ అన్న అనుమానంతో ఎక్కువమంది తమని అప్రోచ్ అవుతున్నారని, ఈ యాప్ అంతటా అందుబాటులోకి వస్తే తమ పని చాలావరకు సులభం అవుతుందని డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×