BigTV English

Five Mistakes At Home : ఇంట్లో ఈ ఐదు తప్పులు చేస్తున్నారా…

Five Mistakes At Home : ఇంట్లో ఈ ఐదు తప్పులు చేస్తున్నారా…

Five Mistakes At Home : మీ ఇల్లు లక్కీహోంగా మారాలంటే ఈ తప్పులు చేస్తున్నారో ఒకసారి చెక్ చేయండి. తెలిసో తెలియకుండా మన ఇంటి వాస్తు విషయంలో తప్పులు చేస్తుంటాం. అది తప్పు తెలిసేలోపలే జరగాల్సి నష్టం జరిగిపోతుందా. అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించినా ఏదీ మన కంట్రోల్ లో ఉండదు. అందుకి మనం నివసించే ఇంట్లో మనం చేసిన తప్పులే. ఇంట్లో పైపులు కానీ నల్లాకానీ లీకవుతుంటే
కొంతమంది అసలు పట్టించుకోరు. టైమ్ లేకో రిపేర్ చేసే పరిస్థితులు లేక వదిలేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదు. ఇంట్లో ఎలాంటి లీకేజీలు ఉన్నా వాటిని బాగు చేయించాలి. లేదంటే ఆర్ధిక నష్టాలకి అది కారణం అవుతుంది. ఆరోగ్య సమస్యల కూడా వెంటాడుతాయి.


ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ మూల చూసినా బూజలు, దుమ్ము కనిపిస్తే దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంటికి ఆర్ధికంగా నష్టపరుస్తుంది. కిటికీలు, అద్దాల ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది.మిమ్మల్ని ఫైనాన్షియల్ గా దెబ్బతీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను ఇంటి అపరిశుభ్రంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యంగా కూడా పదిలంగానే ఉంటుంది. లేదంటే ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుంది.

ఇంటిని చీకటి గుహలా ఉంచకూడదు. సూర్యరశ్మి తగిలేలా ఏర్పాట్లు చేసుకోండి. మంచిగాలి లోపలి ప్రవేశించేలా జాగ్రత్తలు తప్పనిసరి. ఇంట్లో సరిగా వెంటిలేషన్ లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వెంటిలేషన్ సరిగా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. జీవితంపాజిటివిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో డబ్బు పెట్టుకునే విషయంలో కూడా అవగాహనతో ఉండాలి. నైరుతి దిశలోనే నగలు, డబ్బు దాచుకోవాలి. డబ్బుకు సంబంధించిన ప్రతి అంశాన్ని నైరుతి దిశలో ఉంచడం లాభం కలుగుతుంది.ఇంట్లో ఈశాన్య దిశలో కుబేరుడు ఉండే స్థానం .కాబ్టటి ఈశాన్య ప్రాంతాన్ని బరువులు లేకుండా శుభ్రంగా చూసుకోవాలి. ఈ దిక్కు శుభ్రంగా ఉంటే మీ ఇల్లు లక్కీ హోంగా మారుతుంది. కుబేరయంత్రాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజించాలి.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×