BigTV English

Cyclone : సాయంత్రం తీరం దాటనున్న తుపాన్.. గుజరాత్ కు ముప్పు.. 8 రాష్ట్రాల్లో వర్షాలు..

Cyclone : సాయంత్రం  తీరం దాటనున్న తుపాన్.. గుజరాత్ కు ముప్పు.. 8 రాష్ట్రాల్లో వర్షాలు..


Cyclone : బిపోర్‌ జాయ్‌ తుపాన్ గురువారం తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షాలు కురవడంతోపాటు అతి బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాన్ బుధవారం గుజరాత్‌లోని కచ్‌, దక్షిణ పాకిస్థాన్‌ వైపు దిశను మార్చుకుంది. జఖౌ వద్ద తీరాన్ని దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ గమనం మందగించిందని ప్రకటించారు.

తుపాన్ సౌరాష్ట్ర, కచ్‌లను తాకుతుంది. అలాగే మాండవి, కరాచీల మధ్య జఖౌ సమీపంలో తీరాన్ని దాటనుంది. తుపాన్ స్వల్పంగా బలహీనపడిందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. అయినా సరే గుజరాత్‌కు ముప్పు పొంచే ఉందని హెచ్చరించారు. తుపాన్ తీరాన్ని దాటే సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సౌరాష్ట్ర, కచ్‌లలో కెరటాలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడతాయని పేర్కొన్నారు.


తుపాన్ ముప్పుతో గుజరాత్‌ తీర ప్రాంతాల్లోని సుమారు 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేవభూమి ద్వారక, జాంనగర్‌, జునాగఢ్‌, పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌ జిల్లాల్లోని తొమ్మిది తాలూకాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాధిపతులతో చర్చించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం 18 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మహారాష్ట్రలో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు మోహరించారు. ముంబైలో 5 బృందాలను సిద్ధం చేశారు.

బిపోర్‌ జాయ్‌ తుపాన్ ప్రభావంతో గుజరాత్‌తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతోపాటు దమణ్‌ దీవ్‌, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×