BigTV English

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

sexually assaulting 21 children in Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. షివోమి జిల్లాలోని కారో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 21 మంది విద్యార్థులపై ఆ పాఠశాల వార్డెన్ లైంగిక దాడి చేశాడు. 2022లో జరిగిన ఈ ఘటనపై పోక్సో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే 2019 నుంచి 2022 మధ్య సుమారు 6 నుంచి 15 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ లైంగికంగా దాడి చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గతేడాది నవంబర్‌లో కవలలు అయిన ఓ ఇద్దరిపై లైంగిక దాడి చేసినట్లు తేలడంతో బాధితుల తండ్రి ఫిర్యాదు చేయడంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది. ఈ కేసును పరిగణనలోని తీసుకొని ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అనంతరం ఈ ప్రత్యేక కమిటీ 2023 జులైలో ఛార్జీషీటు దాఖలు చేసింది. అయితే, ఇందులో వార్డెన్ అరాచకాలు బయటపడ్డాయి. ఏకంగా 21మంది విద్యార్థులలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలింది.

కాగా, కొంతమంది విద్యార్థులు వార్డెన్ వికృత చేష్టలకు భయపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారని తెలిసింది. కొంతమందిపై లైంగిక దాడికి ముందు విద్యార్థులకు మత్తు వచ్చేలా మందులను ఇచ్చివాడని, ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. మరికొంతమంది విద్యార్థులపై లైంగిక దాడి చేసిన తర్వాత ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు సైతం గురిచేశాడని తనిఖీలో బయటపడింది.


అయితే కొంతమంది విద్యార్థులు వార్డెన్‌పై ఓ మహిళా టీచర్‌కు చెప్పినప్పటికీ.. ఆమె పట్టించుకోలేదని తెలిసింది. దీంతో విద్యార్థులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైతం పర్యవేక్షణ చేయలేదని దర్యాప్తులో బయటపడింది. అయితే ఇందులో 15 మంది బాలికలు, ఆరుగులు బాలురు ఉన్నారు, వీరంతా 6నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉన్నారు.

ఈ మేరకు ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 21మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడిన హాస్టల్ వార్డెన్ యుమ్ కెన్ బంగ్రాకు మరణశిక్ష విధించింది. అలాగే ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు సింగుటున్ యోర్పెన్, హిందీ టీచర్ మార్ బోమ్ నగోమ్ దిర్‌లకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Also Read: బెంగళూరు హత్య కేసులో ట్విస్ట్.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్

ఇదిలా ఉండగా, 2022లో కేసు నమోదైన వెంటనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తర్వాత అదె నెల చివరిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గౌహతి హైకోర్టు ఇటానగర్ బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉండడంతో 2024 జులైలో బెయిల్ రద్దు చేసింది. అనంతరం పోక్సో కోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంపై ఎస్పీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ మాట్లాడారు. ప్రస్తుతం కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×