BigTV English

Bengaluru Murder Case: బెంగళూరు హత్య కేసులో ట్విస్ట్.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్

Bengaluru Murder Case: బెంగళూరు హత్య కేసులో ట్విస్ట్.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్

Bengaluru Murder Case: బెంగళూరులో మహిళను హత్య చేసి 59 ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ హత్య కేసు నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. నిందితుడు ఒడిస్సాలోని భద్రక్ జిల్లాలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతే కాకుండా అతడికి సంబంధించిన డైరీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందు, హంతకుడు తన తల్లితో మహాలక్ష్మి హత్య గురించి చెప్పి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ముక్తి రంజన్ బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా హంతకుడి గురించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆత్మహత్యకు ముందు తానే మహాలక్ష్మిని హత్య చేసినట్లు తల్లికి చెప్పాడని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే మరో వైపు ఈ విషయమై బీజేపీ, జేడీఎస్‌లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలీసులు నిందితుడి పట్టుకోలేక పోయారని ఆరోపించాయి. పోలీసులు హంతకుడి వద్దకు చేరుకునే లోపే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డాయి.


Also Read: విధుల్లోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగిని.. అదే కారణమా ?

ప్రస్తుతం నిందితుడి సూసైడ్ నోట్ కూడా సంచలనంగా  మారింది. మహాలక్ష్మి ప్రవర్తనతో తాను విసిగిపోయానని ముక్తి సూసైడ్ నోట్‌ లో రాసాడని పోలీసులు తెలిపారు. నేను మహాలక్ష్మిని ప్రేమించాను.. కానీ ఓ కిడ్నాప్ కేసులో నన్ను ఇరికిస్తానని మహాలక్ష్మి బెదిరించేదని ముక్తి పేర్కొన్నాడు. నేను ఆమెకు చాలా డబ్బులు కూడా ఇచ్చాను, కానీ ఆమె నిరంతరం నన్ను ఒత్తిడి చేసేది అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ముక్తి సూసైడ్ నోట్, ల్యాప్‌టాప్ లను  బెంగళూరు పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు, ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

వివాహ ఒత్తిడే మహాలక్ష్మి హత్యకు కారణం:
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముక్తి రంజన్, మహాలక్ష్మి కలిసి ఓ బట్టల దుకాణంలో పనిచేసేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మహాలక్ష్మి పెళ్లి చేసుకోమని ముక్తిపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఈ ఒత్తిడి కారణంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వివాదమే ముక్తి రంజన్‌ హత్య మహాలక్ష్మిని హత్య చేయడానికి కారణం అయిందని  పోలీసులు భావిస్తున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×