BigTV English

Ysrcp: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..

Ysrcp: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..

Ysrcp: ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ తిరుగులేదని తలపండిన రాజకీయ నేతలు అప్పుడప్పుడు చెబుతారు. అధికారం లో ఉన్నప్పుడు అదే చేసి సక్సెస్ అయ్యింది. కాకపోతే సీన్ రివర్స్. తాజాగా వైసీపీ కొత్త ప్రచారం మొదలుపెట్టేసింది. తిరుపతిలో జగన్‌పై దాడికి కూటమి నేతలు సిద్ధమైనట్టు చెబుతోంది.


రివర్స్ టెండర్ అనే పదానికి జగన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చెబుతారు. వైసీపీ రూలింగ్‌లోకి వచ్చిన తర్వాత ఈ పదానికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. రివర్స్ అనేది వైసీపీ కొంప కొల్లేరు చేసిందని ఆ పార్టీలోని కొందరు నేతల వాదన. తిరుమల లడ్డూ వివాదంతో ఆ పార్టీ ఇమేజ్ పాతాళానికి పడిపోయిందని అంటున్నారు.

పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో పడ్డారు అధినేత జగన్. ఇందులో భాగంగా శనివారం తిరుమల టూర్‌కు శ్రీకారం చుట్టారు. గతంలో వివాదాలతో ఇమేజ్‌ని సొంతం చేసుకున్న మాజీ సీఎం, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డారు.


అన్యమతస్థులు ఎవరైనా తిరుమలకు వస్తే.. కొండపై డిక్లరేషన్ ఇస్తారు. కానీ జగన్‌ను మాత్రం తిరుపతిలోనే డిక్లరేషన్ ఇవ్వాలని హిందూవాదుల డిమాండ్. లడ్డూ వ్యవహారం తర్వాత తిరుపతి, తిరుమల కు హిందూ సంఘాలు వచ్చాయి. ఈలోగా జగన్ తిరుమల టూర్ నేపథ్యంలో కూటమి సర్కార్ అలర్టయ్యింది.

ALSO READ: తిరుమల లడ్డు వివాదం.. రంగంలోకి దిగిన సిట్ టీమ్, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో?

ఈ నేపథ్యంలో పోలీసులు సెక్షన్ 30 ఇంప్లిమెంట్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే సెక్షన్ 30 అనేది వైసీపీ ప్రభుత్వానికి ప్రధాన అస్త్రం. జగన్ తిరుమల వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలకు ముందుగానే నోటీసులు ఇచ్చారు పోలీసులు. తిరుపతి, తిరుమలలో సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ.

తాజాగా వైసీపీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రం తిరుమలకి చేరుకోనున్నారు జగన్. తిరుమల పర్యటనలో ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయనపై దాడికి బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు ప్లాన్ చేసినట్టు ప్రచారం మొదలుపెట్టేసింది.

జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, కాన్వాయిపై గుడ్లు వేసేందుకు మనుషుల్ని పురమాయించినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం మొదలుపెట్టేసింది. తిరుమల పర్యటనతో లడ్డు వ్యవహారం బయట పడుతుందనే భయం సీఎం చంద్రబాబు వెంటాడుతుందని ప్రశ్నించింది.

మరోవైపు జ‌గ‌న్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోకూడ‌ద‌ని ఎన్డీయే కూట‌మి నిర్ణ‌యించింది. ఆ కూటమి నేతల సమావేశానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహయాదవ్, పసుపులేటి హరిప్రసాద్, అజయ్‌కుమార్ హాజరై చర్చించారు. జగన్ వెళ్ళే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాల‌ని తీర్మానం చేశారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×