E-Paper
Advertisement

Ayatollah Ali Khamenei: ఖమేనీ హత్యకు సీఐఏ, ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగిందంటే?

Ayatollah Ali Khamenei: ఖమేనీ హత్యకు సీఐఏ, ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Ayatollah Ali Khamenei: ఇజ్రాయెల్, యూఎస్ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. అయితే ఖమేనీ ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో కచ్చితమైన సమాచారం లీకవ్వడంతో.. CIA ఇజ్రాయెల్ ఖమేనీ హత్యకు ప్రణాళిక రచించాయి. గత కొన్ని నెలలుగా ఖమేనీ కదలికలపై సీఐఏ నిఘా పెట్టింది. ఖమేనీ శనివారం తన సలహాదారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం లీకైంది. ఈ సమయంలో టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, యూఎస్ వైమానిక, నౌకా దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఖమేనీ ముందుగా శనివారం సాయంత్రం టెహ్రాన్‌లో సమావేశమవుతారని సీఐఏకి సమాచారం అందింది. కానీ శనివారం ఉదయమే టెహ్రాన్ లో భేటీ జరుగుతుందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు సమాచారం అందింది.

సీఐఏ మాస్టర్ ప్లాన్

ముఖ్యంగా, సుప్రీం లీడర్ ఖమేనీ సమావేశంలో ఉన్నారని CIA తెలుసుకుంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఒక్కసారిగా దాడికి దిగాయి. ఇన్నాళ్లు బయటకు రాని ఖమేనీ సమావేశంలో పాల్గొనేందుకు వస్తుండడంతో.. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని అమెరికా సీఐఏ ఖమేనీ హత్యకు ప్లాన్ వేసి పకడ్బందీగా అమలు చేశాయి.

చర్చలు జరిగిన రెండ్రోజులకే

Advertisement

ఒమన్ మద్దతుతో జెనీవాలో రెండు రోజుల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య అసంపూర్తిగా చర్చలు జరిగాయి. ఇంతలో ట్రంప్ ఇరాన్‌ పై దాడికి పాల్పడ్డారు. ఇజ్రాయెల్‌లో శనివారం ఉదయం 6 గంటలకు ఆపరేషన్ ప్రారంభించింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ తో యుద్ధ విమానాలు ఇరాన్ పైకి దూసుకొచ్చాయి. జెట్‌లు బయలుదేరిన రెండు గంటల ఐదు నిమిషాల తర్వాత, ఉదయం 9:40 గంటల ప్రాంతంలో టెహ్రాన్‌లో విధ్వసం స్టార్ట్ అయింది.

సమాచారం లీకై

శనివారం ఉదయం టెహ్రాన్‌లోని అనేక ప్రదేశాలపై ఒకేసారి ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు దాడి చేశాయి. యుద్ధానికి సిద్ధమయ్యేందుకు ఇరాన్ హై ప్రొఫైల్ వ్యక్తులంతా ఒక చోట సమావేశం అయ్యారు. ఈ సమావేశం సమాచారం సీఐఏకి లీకైంది. దీంతో ఖమేనీ హై-సెక్యూరిటీ కాంపౌండ్‌ను యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఉపగ్రహ చిత్రాలతో ఈ దాడిని ఇజ్రాయెల్ నిర్థారించింది. టెహ్రాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టడంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తత నెలకొంది.

ప్రతీకారం తీర్చుకుంటాం -ఐఆర్జీసీ

Advertisement

ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణించారని ఆ దేశ మీడియా నిర్ధారించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సుప్రీం లీడర్ ను హత్య చేసిన “హంతకులను” శిక్షిస్తామని ప్రకటించింది. “చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ట్రంప్ ఒకరు” అని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఖమేనీతో పాటు అతని కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఖమేనీకి సలహాదారుడు అలీ షంఖానీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ జనరల్ మొహమ్మద్ పక్పూర్ మరణించారు. ఈ దాడులను నుంచి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజాని బయటపడ్డారు.

Also Read:  చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఖమేనీని హత్య చేసిన హంతకులను శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌పై చరిత్రలో అత్యంత భయంకరమైన దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీసుకుంటామని తెలిపింది.

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×