Big Stories

Asteroids:- గ్రహశకలాల వల్ల భూమికి ప్రమాదం.. ఎప్పుడంటే..?

Asteroids:- అంతరిక్షంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆస్ట్రానాట్స్ ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటారు. ఎందుకంటే అంతరిక్షంలో జరిగే ఏ చిన్న విషయం అయినా భూమిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్కసారి అంతరిక్షంలో పేరుకుపోయిన శాటిలైట్ల చెత్త వల్ల, గ్రహశకలాల వల్ల భూమికి హాని జరిగే ప్రమాదాలు కూడా ఉంటాయి. అయితే గ్రహశకలాల వల్ల భూమికి జరిగే హాని గురించి తాజాగా ఆస్ట్రానాట్స్ చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

- Advertisement -

భూమి అనేది ఏ గ్రహశకలం వల్ల అటాక్ అయ్యే అవకాశం లేదని ఆస్ట్రానాట్స్ తేల్చారు. దాదాపు 1000 ఏళ్ల వరకు ఏ గ్రహశకలం కూడా భూమికి దగ్గరగా రాలేదని నిర్ధారించారు. ప్రస్తుతం చాలా గ్రహశకలాలు భూమికి దగ్గరగా ప్రయాణిస్తున్నా కూడా అవేవి ఇప్పట్లో భూమికి హని కలిగించేంత దగ్గరలో లేవని తెలిపారు. ఇది ఒక మంచి వార్త అని వారు ప్రకటించారు. ప్రస్తుతం నాసా చేసిన పరిశోధనల ప్రకారం భూమికి దగ్గరగా దాదాపు 962 వస్తువులు తిరుగుతూ ఉన్నాయని తెలుస్తోంది.

- Advertisement -

మామూలుగా గ్రహశకలాలు అనేవి 6 లక్షల నుండి 7 లక్షల సంవత్సరాల వరకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తాయని, లేదా వాటికి హాని కలిగిస్తాయని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. 1000 ఏళ్ల తర్వాత అప్పుడు ఏర్పడే గ్రహశకలాల వల్ల భూమికి హాని జరిగే అవకాశం ఉందేమో కానీ అప్పటివరకు వాటి వల్ల మన గ్రహానికి ఏ హాని కలగదని తెలిపారు. అంతే కాకుండా భూమికి, చంద్రుడికి మధ్యలో ఉన్న ఏ ఆస్ట్రాయిడ్ వల్ల భూమికి హాని జరుగుతుంది అన్నదానిపై కూడా వారు పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.

1994 పీసీ1 అనే ఆస్ట్రాయిడ్ మాత్రం చంద్రుడికి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. అయినా కూడా దాని వల్ల ఏ గ్రహానికి ఏ హాని జరగదని తెలిపారు. కిలోమీటర్ కంటే చిన్నగా ఉండే గ్రహశకలాలు కూడా గ్రహాలకు హాని కలిగించేలా ఉంటాయని బయటపెట్టారు. ప్రస్తుతం గ్రహాలను పూర్తిగా ధ్వంసం చేయగల ఆస్ట్రాయిడ్స్ గురించి నాసా పరిశోధనలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ కోణంలో 40 శాతం ప్రయోగాలు పూర్తయ్యాయని ఆస్ట్రానాట్స్ అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News