BigTV English

Robotic Fish : ప్రపంచంలోనే మొదటి రోబో ఫిష్.. సముద్రాలను కాపాడడానికి..

Robotic Fish : ప్రపంచంలోనే మొదటి రోబో ఫిష్.. సముద్రాలను కాపాడడానికి..
Robotic Fish


Robotic Fish : రోబోటిక్స్ రంగం అనేది గత కొన్నేళ్లలో ఎన్నో విధాలుగా మెరుగుపడింది. ముందుగా అసలు రోబోలు అనేవి కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే ఉంటాయి అనుకునేవారు. అలాంటిది వాటిని నిజం చేసి చూపించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత రోబోలు అనేవి కేవలం కొన్ని ప్రయోగాలకు మాత్రమే ఉపయోగపడతాయి అనుకునేవారు. మెల్లగా ఇప్పుడు రోబోలు.. మనుషులకు స్నేహితులుగా మారాయి. తాజాగా మరో కొత్త రకం రోబో సముద్రానికి రక్షించడం కోసం తయారయ్యింది.

నేలను, నీటిని, గాలిని.. ఇలాంటి ప్రకృతి సిద్దమైన వనరులను ఎలాగైతే కాపాడుకుంటున్నామో.. నీటిని కూడా అలాగే కాపాడుకోవాలని పర్యావరణవేత్తలు అంటుంటారు. ముఖ్యంగా భూగ్రహంపై ఎన్నో సముద్రాలు ఉన్నాయి. అదే విధంగా వాటిలో కాలుష్యం కూడా ఉంది. నీటి కాలుష్యం అనేది గత కొన్నేళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. అందుకే వాటిని తక్షణమే కాపాడుకోవడం లక్ష్యంగా భావించారు శాస్త్రవేత్తలు. ఈ పనికోసమే బెల్లేని రంగంలోకి దించారు. బెల్లే అంటే మరెవరో కాదు.. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో ఫిష్.


సముద్రం లోతును ఎవరూ చేరుకోలేరు. ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మనుషులు కొంతవరకే సముద్ర లోతును గుర్తించగలరు. అక్కడి సమాచారాన్ని తెలుసుకోగలరు. కానీ మనుషులకు తెలిసిన దానికంటే సముద్రాల్లో మరెన్నో మిస్టరీలు దాగుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాంటి మిస్టరీలను కనుక్కోవడానికే బెల్లే సిద్ధమయ్యింది. బెల్లే సముద్రాల్లో తిరుగుతూ నీటి ప్రాణులకు ఎలాంటి హాని కలిగించకుండా అక్కడి సమాచారాన్ని, ఫోటోలను తీసుకొని శాస్త్రవేత్తలకు అందిస్తుంది.

ప్రస్తుతం చాలావరకు ఇతర ప్రయోగాలలాగానే బెల్లేను తయారు చేయడంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా సముద్రంలోని ఎకోసిస్టమ్స్‌లోని మిస్టరీలను తెలుసుకొని, వాటిని కాపాడడం కోసం బెల్లేను తయారు చేసినట్టు దీని సృష్టికర్త జురిచ్ తెలిపారు. ఇది ఇతర ప్రాణులకు ఎటువంటి హాని చేయదని హామీ ఇచ్చారు. ఇది చేపలాగే కదులుతుందన్నారు. ఇలాంటి ఒక రోబోటిక్ చేపను తయారు చేయడం, సముద్రంలోని మిస్టరీలను కనుక్కోవడానికి దీనిని రంగంలోకి దించడం మెరీన్ ప్రయోగాల్లోనే సంచలనం అని శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×