E-Paper
Advertisement

Bengaluru Techie Murder: బెంగుళూరు యాక్సిడెంట్.. ప్లాన్ ప్రకారం హత్య, అడ్డంగా బుక్కైన టెక్కీ

Bengaluru Techie Murder: బెంగుళూరు యాక్సిడెంట్.. ప్లాన్ ప్రకారం హత్య, అడ్డంగా బుక్కైన టెక్కీ

Bengaluru Techie Murder: వారిద్దరు ఫ్రెండ్స్.. అప్పటివరకు క్రికెట్ టోర్నమెంట్ ఆడారు. ఇద్దరూ ఓడిపోయారు. అయితే లైటర్ విషయంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఒకరి హత్యకు దారి తీసింది. మద్యం మత్తులో యాక్సిడెంట్ అని భావించారు. కారు డాష్‌ బోర్డ్ కెమెరా ఫుటేజ్ ద్వారా అసలు నిజం బయటపడింది. చివరకు టెక్కీ అరెస్టయ్యాడు.

బెంగుళూరు యాక్సిడెంట్ వెనుక కొత్త కోణం

బెంగళూరులోని హెబ్బగోడి ఠాణా పరిధిలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. బాడీ బిల్డర్ ప్రశాంత్ ఒకరు, మరొకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోషన్‌ హెగ్డే. వీరిద్దరు స్నేహితులు కూడా. టెక్కీది ఉడిపి జిల్లాలోని బ్రహ్మవర్‌కు చెందినవాడు. ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌లో వీరిద్దరు వేర్వేరుగా ఆడిన మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. ఆ తర్వాత వీరు మద్యం పుచ్చుకున్నారు.

మద్యం మత్తులో ప్రశాంత్.. లైటర్ కోసం రోషన్ వద్దకు వచ్చాడు. ఏం జరిగిందో తెలీదుగానీ ఇద్దరి మధ్య వాగ్వాదం రేగంది. ఆ తర్వాత బీరు బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నాడు.చివరకు పరిస్థితి దిగజారడంతో రోషన్ తన కారులో ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఫ్రెండ్ ప్రశాంత్ ఆ కారును వెంబడించాడు. వాహనం ఎడమ వైపు ఫుట్‌బోర్డ్‌పై ఎక్కి డోర్‌ను పట్టుకున్నాడు.

ప్లాన్ ప్రకారం హత్య, అడ్డంగా బుక్కైన టెక్కీ

కారు ఆపమని ప్రశాంత్ పదే పదే వేడుకుంటున్నా రోషన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. కారుని వేగంగా పోనిచ్చాడు. ఆ తర్వాత కారు తొలుత ఓ గోడను ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెట్టుని బలంగా ఢీ కొట్టింది. డు. ఈ ఘటనలో ప్రశాంత్ తలకు గాయం కావడంతో స్పాట్‌లో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కారులోని డాష్‌ క్యామ్‌లో రికార్డు అయ్యాయి.

తొలుత ఈ కేసుని పోలీసులు మద్యం మత్తులో జరిగిన యాక్సిడెంట్‌గా భావించారు. అయితే మృతుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఆ తర్వాత కారులోని డాష్‌ బోర్డ్ విజువల్స్ ద్వారా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: కడప టౌన్‌లో చెడ్డీ గ్యాంగ్.. కత్తులతో సంచారం

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×