E-Paper
Advertisement

Tips for Investments: తెలివైన పొదుపు.. లాభానికి మలుపు!

Tips for Investments: తెలివైన పొదుపు.. లాభానికి మలుపు!
Advertisement

Tips for Investments: చాలామంది పొదుపు చేస్తారు. కానీ.. తమ భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా పొదుపు చేసేవారు మాత్రం కొద్దిమందే ఉంటారు. ఇక.. తమ పెట్టుబడిని మార్కెట్‌కు తగ్గట్టుగా మార్చుతూ దానిని రెట్టింపు చేసేవారు మాత్రం బహుకొద్ది మందే. మరి.. మీరూ మీ పెట్టుబడిపై మంచి లాభాలను అందుకోవాలనుకుంటే.. ఈ కిందివి చదవాల్సిందే.

వయసు
కొత్తగా జాబ్‌లో చేరిన 30 ఏళ్లలోపు వారు.. ఎఫ్‌డీలు, పన్ను ఆదా పీపీఎఫ్‌‌ల కంటే మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి. వీటిలో ద్రవ్యోల్బణానికి మించిన ఆదాయం వచ్చే ఛాన్సుంది. అయితే, మార్కెట్‌ పడిపోగానే సిప్ ఆపటం, విత్‌డ్రా చేయటం వద్దు. మ్యూచువల్‌ ఫండ్లు దీర్ఘకాలంలోనే లాభిస్తాయని గుర్తించాలి.

Advertisement

రిటైర్‌మెంట్ ప్లాన్
40 ఏళ్ల వారు పోస్ట్ రిటైర్మెంట్ ఖర్చులకోసం.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ స్కీమ్‌లో మదుపు చేయొచ్చు. 30 ఏళ్ల వ్యక్తి.. నెలకు రూ.2వేలు, 30 ఏళ్లపాటు సిప్ వేసి, ఏటా 10% పెంచుకుంటూ పోతే.. 12% రాబడి మేరకు రూ. 1.75 కోట్లు అందుతాయి. అదే.. 40 ఏళ్ల వ్యక్తికైతే ఆ మొత్తం రావాలంటే నెలకు రూ.9 వేలు కట్టాలి.

ఒకేచోట వద్దు
పెట్టుబడి ఏదైనా ఒకే చోట పెట్టకూడదు. పెట్టుబడిని స్టాక్స్‌, బాండ్లు, భూమి, బంగారం, బ్యాంకు ఎఫ్‌డీ.. ఇలా వేర్వేరు చోట్ల కొంత కొంత పెట్టుబడిగా పెట్టుకుంటే నష్టభయం ఉండదు. అలాగే.. పిల్లల విద్య, వివాహం, రిటైర్‌మెంట్, ఇంటి నిర్మాణం. వంటి అంశాల్లో మీకు ఏ టైంకి డబ్బు చేతికి రావాలో అంచనా వేసుకుని అందుకు తగిన టైం పీరియడ్ ప్రకారం ముందుగా పెట్టుబడి పెట్టాలి.

Advertisement

ఇతర అంశాలు
డీమ్యాట్ అకౌంట్ ఉంది కదా అని సరైన అవగాహన లేకుండా షేర్లు కొనటం వంటివి చేయొద్దు. అలాగే.. మీ పెట్టుబడి మీద వచ్చే ఐటీ వంటి పన్ను సదుపాయాలను వినియోగించుకోవటం కూడా మరచిపోవద్దు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×