E-Paper
Advertisement

Bhadradi: భద్రాద్రి రాములోరి తలంబ్రాలు మీ ఇంటికే డోర్ డెలివరీ – అందుకోసం ఎం చేయాలో తెలుసా..?

Bhadradi: భద్రాద్రి రాములోరి తలంబ్రాలు మీ ఇంటికే డోర్ డెలివరీ – అందుకోసం ఎం చేయాలో తెలుసా..?
Advertisement

Bhadradi: భద్రాద్రి రాములోరి తలంబ్రాలు కావాలా…? అయితే మీ ఇంటికే డోర్‌ డెలివరీ అవుతాయి. అయితే అందుకోసం మీరు ముందుగానే బుక్‌ చేసుకోవాలి. ఎలా బుక్‌ చేసుకోవాలి..? ఎప్పుడు బుక్‌ చేసుకోవాలి…? ఎక్కడ బుక్‌ చేసుకోవాలి..? బుక్‌ చేసుకోవడానికి కావాల్సిందేంటి..? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరామనవమికి రెండు తెలుగురాష్ట్రాల్లో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రజలు. అయితే రెండు రాష్ట్రాల్లో జరిగే కళ్యాణాలు ఒక ఎత్తు అయితే ఒక్క భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం ఒక ఎత్తు.. శ్రీరామనవమికి వారం రోజుల ముందు నుంచే భద్రగిరి మొత్తం భక్తులతో నిండిపోతుంది. స్వామి వారి కళ్యాణం కన్నులవిందుగా చూడాలనే భక్తులు భద్రచలం వెళ్తారు. అయితే స్వామి వారి కళ్యాణం చూశాక ఆయన తలంబ్రాలు పిడికెడు అయినా దొరికితే చాలు అనుకుంటారు. అందుకోసం ఎంతో ప్రయాసకోర్చి తలంబ్రాలు దొరికిచ్చుకుంటారు. అయితే ఇదంతా భద్రాచలం వెళ్లిన భక్తులు వరకు బాగుంది. కానీ ఆ భద్రగిరి వెళ్లని భక్తులు పరిస్థితి ఏంటి..? ఆ రాములోరి కళ్యాణం కన్నులారా చూడకపోయినా పిడికెడు తలంబ్రాలు దొరికితే చాలు అనుకునేవారి పరిస్థితి ఏంటి..? సరిగ్గా ఇక్కడే తెలంగాణ ఆర్టీసీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భద్రాచలం వెళ్ళలేని భక్తుల కోసం ఆ రాములోరి తలంబ్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే మీ ఇంటిక రామయ్య తలంబ్రాలు పంపించేందుకు సిద్దం అయింది.

ఎలా బుక్‌ చేసుకోవాలి:

Advertisement

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.  ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లు’ పొందాలనుకునే భక్తులు www.tgartclogistics.co.in వెబ్ సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.

తలంబ్రాల ప్రత్యేకత:

భద్రాచలంలో స్వామి వారి కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ తలంబ్రాలను భక్తులు “నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితమే టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది.  2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత మూడేళ్ళలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందట. భద్రాద్రిలో మార్చి 27న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440069లలో సంప్రదించవచ్చట.

Advertisement

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల శ్రీవారి ఏడు శనివారాల వ్రతం ఏయే రోజుల్లో ప్రారంభించాలో తెలుసా..?

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×