BigTV English

Bhatti Vikramarka: ఆవేశంతోనే దాడి.. ఆ నేతను వెంటనే సస్పెండ్ చేయాలి.. భట్టి డిమాండ్

Bhatti Vikramarka: ఆవేశంతోనే దాడి.. ఆ నేతను వెంటనే సస్పెండ్ చేయాలి.. భట్టి డిమాండ్

Bhatti Vikramarka: ప్రియాంక గాంధీ గారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిజెపి కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాదులో గాంధీ భవన్,  బిజెపి కార్యాలయాలపై జరిగిన దాడులకు పాల్పడిన వారిని చట్టరీత్యా శిక్షిస్తామన్నారు. హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడే బిజెపి నాయకులకు ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలు వినిపించలేదా అంటూ భట్టి ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రమేష్ బిదోరి ఇటీవల ఎంపీ ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మాటలను భారతదేశంలో స్త్రీల పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.


అలాగే బీజేపీ కార్యాలయం, గాంధీభవన్ పై జరిగిన దాడులను ఉపేక్షించమన్న డిప్యూటీ సీఎం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఎవరు ఎవరిపై దాడులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పామన్నారు భట్టి. బీజేపీ కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఉప ముఖ్యమంత్రిగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఖండించడం జరిగిందన్నారు. బీజేపీ కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాడి చేసిన విషయం, అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియదని, వారితో తాను ఇప్పుడే ఫోన్ లో మాట్లాడినట్లు భట్టి మీడియాకు తెలిపారు.

కొంతమంది బీజేపీ నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండి. సంస్కృతి, సంస్కారం నేర్పండంటూ హితవు పలికారు. ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ సంస్కృతిని దిగజార్చే పరిస్థితి తెచ్చినందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పై బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను దేశం పైన ప్రేమ, అభిమానం, స్త్రీల పైన గౌరవం ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.


ప్రియాంక గాంధీ పట్ల బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను రెండు రోజులుగా కేంద్ర నాయకత్వం ఖండించకపోవడం విచారకరమన్న భట్టి, బిజెపి నాయకుడు చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేక తాత్కాలిక ఆవేశంతో కొంతమంది యువజన కాంగ్రెస్ నాయకులు బిజెపి కార్యాలయం పైన దాడి చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయం పై దాడులు చేయడం గాంధీ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదన్నారు భట్టి. అహింసా,  గాంధేయ మార్గంలో ఎదుటివారి తప్పులను ఎత్తిచూపుతూ, ప్రజాస్వామ్యంగా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడమే తప్ప భౌతిక దాడులను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు.

Also Read: Rythu Bharosa Scheme Update: రైతుభరోసా స్కీమ్‌.. కీలక అప్ డేట్ ఇదే

భారత రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ హక్కును వినియోగించుకొని తమ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు మరోమారు భట్టి పునరుద్ఘాటించారు. బిజెపి నేత రమేష్ బిదోరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండ, బీజేపీ నాయకత్వం కళ్లు మూసుకొని నిద్ర పోతుందా? రెండు రోజులు అవుతున్న ఎందుకు ఖండించలేదు? రమేష్ బిదోరిని సస్పెండ్ చేసి ఉండాల్సిందని భట్టి సూచించారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×