E-Paper
Advertisement

Job calendar: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఆర్ఆర్‌బీ

Job calendar: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఆర్ఆర్‌బీ
Advertisement

Job calendar: నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లక్షలాది మంది యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది.

ఈ క్యాలెండర్ ప్రకారం.. 2026 ప్రారంభం నుంచే నోటిఫికేషన్ల పరంపర మొదలుకానుంది. ఫిబ్రవరి నెలలో అసిస్టెంట్ లోకోపైలట్ (ALP) పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం మార్చి నెలలో టెక్నీషియన్ విభాగాల్లో ఉన్న వేల సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ నెలలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఈ వరుస నోటిఫికేషన్లు రానుండడంతో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సంవత్సరం ద్వితీయార్థంలో మరిన్ని కీలక నోటిఫికేషన్లు రానున్నాయి. జులై నెలలో పారామెడికల్ స్టాఫ్ తో పాటు జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. రైల్వేలో అత్యంత క్రేజ్ ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) నోటిఫికేషన్ ఆగస్టులో వెలువడనుంది. ఇది పట్టభద్రులకు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి గొప్ప అవకాశం. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీల భర్తీ జరగనుంది. చివరిగా.. అక్టోబర్ నెలలో భారీ స్థాయిలో అభ్యర్థులు ఎదురుచూసే గ్రూప్-డీ (లెవల్-1) పోస్టుల నోటిఫికేషన్ రానుంది.

రైల్వే బోర్డు క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించడం వల్ల అభ్యర్థులకు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే వెసులుబాటు కలిగింది. గతంలో నోటిఫికేషన్ల మధ్య అనిశ్చితి ఉండేది, కానీ ఇప్పుడు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత రావడంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే ఏకాగ్రతతో చదువుకోవచ్చు. రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కీలకం కాబట్టి.. ఆయా అంశాలపై పట్టు సాధించడం అవసరం.

Advertisement

రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. క్యాలెండర్ విడుదలతో కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్, నిరంతర సాధన ఉంటే, 2026లో రైల్వే ఉద్యోగం సాధించడం అసాధ్యమేమీ కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు ప్రిపరేషన్ మొదలు పెట్టండి.. ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి.. జాబ్ సాధించండి.. ఆల్ ది బెస్ట్.

ALSO READ: Top 20 News: ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక, సర్పంచ్ అభ్యర్థి పై కారం పొడితో దాడి, ప్లాస్టిక కవర్‌లో శిశువు మృతదేహం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×