Dettadi Harika : సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు గా మారిన విషయం తెలిసిందే.. తమ వీల్స్ వీడియోలతో బాగా పాపులారిని సంపాదించుకొని ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు.. యూట్యూబ్ ఇన్ఫ్లోన్సర్ గా పని చేసిన చాలామంది ముద్దుగుమ్మలు సినిమాల్లో అవకాశాలు అందుకొని వరసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారారు.. అలాంటి వారిలో దేత్తడి హారిక అలియా అలేఖ్య హారిక ఒకరు.. ఒక యూట్యూబర్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి సెలబ్రిటీగా మారిపోయింది. బిగ్ బాస్ తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళింది అని చెప్పాలి..బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు , ఆ సీజన్ విన్నర్ అభిజిత్‌తో హారిక చాలా క్లోజ్‌గా ఉండేది.. వాళ్లిద్దరి మధ్య ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి అలేఖ్య చేసుకోబోతున్న వరుడు గురించి తెలుసుకోవాలని నెటిజెన్లు ఆతృత కనబరుస్తున్నారు.. ఇంతకీ అలేఖ్య ఎవరిని చేసుకోబోతుంది అన్నది మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
బిగ్ బాస్ లో కంటెంట్ కోసం కొన్ని జంటల మధ్య లవ్ ఉన్నట్లు క్రియేట్ చేసి చూపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.. ఆ కంటెంట్ ప్రకారం ఇక ఆ జంటలు కూడా వాళ్ళ మధ్య నిజంగానే ఎఫైర్ ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బయట కూడా అదే విధంగా ఉండడంతో నిజంగానే వీళ్ళిద్దరూ లవర్సా అని డౌట్ కూడా జనాలకు వస్తుంది.. కానీ ఈ అలేఖ్య హారిక మాత్రం బిగ్ బాస్ తర్వాత అభిజిత్ ను ఎక్కడా కలవలేదు.. దాంతో ఇవి కేవలం రూమర్సే అని అనుకున్నారు. అయితే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు మరోసారి ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధంనే ఆమె చేసుకోబోతుంది అని తెలుస్తుంది.. హైదరాబాదులోనే ఒక పెద్ద బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే హారిక స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే..
దేత్తడి పోచమ్మ గుడి అనే డైలాగు అందరికీ గుర్తు ఉంటుంది.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. యూట్యూబ్ వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక.. బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్ 5లో నిలిచింది. అందరూ ఈమె విన్నర్ అవుతుందని అనుకున్నారు.. కానీ ఆమె విన్నర్ గా నిలవలేదు.. బయటికి వచ్చిన తర్వాత ఆమెకున్న క్రేజ్ పదింతలు పెరిగింది అని చెప్పాలి.. ఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. కోయిల కోయిల పాట హారిక కు మంచి క్రేజ్ ని అందించింది.. ప్రస్తుతం ఈమె షార్ట్ వీడియోలతో పాటుగా ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది.. హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తుంది.