E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు సేమియా తింటుంటే.. రాజు చూస్తుంటాడు. ఇందు కోపంగా ఏయ్‌ ఎందుకు అలా చూస్తున్నావు.. అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అంటుంది. దీంతో రాజు కోపంగా ఏయ్‌ దిష్టి గిష్టి అని మాట్లాడకు అనగానే.. తింటున్నప్పుడు గుడ్లు అప్పగించి చూస్తే.. దిష్టే తగులుతుంది. కావాలంటే కింద కిచెన్‌లోకి వెళ్లి నువ్వు తెచ్చుకో కానీ అలా చూడకు అంటుంది. దీంతో రాజు కోపంగా ఓసేయ్‌ నువ్వసలు మనిషివేనా..? అంటాడు.

దీంతో ఇందు కోపంగా ఏయ్‌ మాటలు హద్దులు దాటుతున్నాయి అనగానే.. అయినా నువ్వు మనిషివేనా..? మొగుడు అనే జాలి దయ లేకుండా..ఇంత పగ ఏంటే నీకు నిన్ను కిడ్నాప్‌ చేసా..? కానీ నీ టార్చర్‌ నేను అనుభవించా..? ఇప్పుడు ఆఫీసుకు తీసుకెళ్లి నాటకం ఆడుతున్నావు.. అసలు నీ ఉద్దేశం ఏంటో చంపేద్దామని ఫిక్స్‌ అయిపోయావా..? అంటూ తిడుతుంటే.. ఇందు కోపంగా  హలో ఏంటి.. ఈ ఓవరాక్షన్‌ అంటుంది. దీంతో రాజు ఓవరాక్షన్‌ కాదని.. తన కష్టాల గురించి చెప్తాడు. దీంతో ఇందు సీఈవో విషయంలో తనను రేఖ సీఈవోను చేయడానికే ఈ నాటకం ఆడుతున్నానని ఇందు చెప్పగానే.. రాజు షాక్‌ అవుతాడు. కానీ రేఖకు ఏమైనా డౌటు వస్తే.. అంటాడు రాజు. వాళ్లకు అసలు రాదు.. అని చెప్తుంది ఇందు.

Advertisement

హాల్లో కూర్చుని రాజు గురించి ఆలోచిస్తుంటారు భ్రమరాంబ, భూషణ్‌, రేఖ. అసలు ఆ రాజు గాడిని ఎందుకు వదిలేస్తున్నావు రేఖ అంటూ భ్రమరాంబ అడగ్గానే.. వాడిని వదిలేయడం కాదు వదిన.. అనగానే.. వాడు మొండోడు దేనికి వెనకాడడు.. అంటూ సుభాస్‌ చెప్పగానే.. కానీ నేను ఊరుకోను కదా నా ప్లాన్స్‌ నాకున్నాయి కదా..? నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది అని చెప్పగానే.. రూంలో ఉన్న ఇందు ఆ బ్రహ్మాస్త్రం నేనే అని చెప్తుంది. రేఖ తాను ఆ బ్రహ్మాస్త్రం అడ్డుపెట్టుకుని మళ్లీ సీఈవో గా అయిపోతానని చెప్తుంది. ఇందు చెప్పిన మాటలు విన్న రాజు నిన్ను చూస్తుంటే.. ఇంత చిన్నగా ఉన్నావు.. చదువు రాదు అంటారు.. కానీ ఇప్పుడు మీ రేఖ ఆంటీని కూడా పిచ్చిదాన్ని చేస్తున్నావు కదా..? నేను పిచ్చోణ్ని అని ఇప్పుడే తెలిసింది.. అంటాడు.

నందు దగ్గరకు వెళ్లిన వెంకట్‌ తన జాబ్‌ పోయిందని బాధపడుతుంటాడు. అయితే జాబ్‌ పోయిందని బాధపడితే ఎలా మరో జాబ్‌ కోసం ట్రై చేయమని చెప్తుంది. ప్రపంచంలో ఎవ్వరికీ జాబ్‌ పోలేదా..? నీ ఒక్కడికే పోయిందా..? జాబ్‌ పోయిందని నువ్వు బాధపడటం కాదు.. నిన్ను వదులుకున్నందుకు ఆ కంపెనీ వాళ్లు బాధపడేలా చేయమని చెప్తుంది. వెంకట్‌ సరే కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ అడగ్గానే.. నీకోసం ఒక అమ్మాయిని చూశానని మొన్న చూసిన అమ్మాయిల్లా కాకుండా ఈ అమ్మాయి చాలా మంచిది నేను ఇప్పుడు తనను రమ్మని చెప్పాను అనగానే.. తను వస్తే పంపించేయ్‌.. నాకు ఇప్పుడు మాట్లాడే మూడు లేదు అంటూ వెంకట్ చెప్పగానే.. నందు ఈ అమ్మాయి అలా కాదు నీ మూడ్‌ మార్చేందుకే నేను ఆ అమ్మాయిని రమ్మన్నాను అని చెప్తుండగానే.. ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయితో వెంకట్‌ మూడీగా మాట్లాడతాడు. వెంకట్‌ బిహేవియర్‌ చూసి  ఆ అమ్మాయి వెళ్లిపోతుంది.

Advertisement

స్వాతి వెళ్లి మదన్‌కు ప్రపోజ్‌ చేస్తుంది. దానికి మదన్‌ ఒప్పుకోడు. రేఖ ఎవరిని పెళ్లి చేసుకోమని చెబితే వాళ్లనే చేసుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు. స్వాతి బాధపడుతుంది. అంతా చాటు నుంచి వింటుంది ఇందు. స్వాతి దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. స్వాతి ఏడుస్తుంటుంది. మదన్‌కు వాళ్లమ్మే నిన్ను చేసుకోమని చెప్పేలా చేస్తాను అంటూ స్వాతిని తీసుకుని లోపలికి వెళ్తుంది. డోర్‌ చాటు నుంచి రేఖ అంతా వింటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

హైదరాబాద్ భారీ వర్షం .. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

Big Stories

Advertisement
×