Big Stories

Brain diseases : రక్తనాళాలలోని మార్పులతో మెదడు వ్యాధులు గుర్తింపు..

- Advertisement -

Brain diseases : మెదడు సంబంధిత వ్యాధులు ఈరోజుల్లో మనుషులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చాలావరకు వ్యాధులు అసలు ఎందుకు వస్తున్నాయి, వాటికి కారణమేంటి, ఈ సమస్యలకు మెరుగైన చికిత్స అనేది ఎలా సాధ్యం లాంటి విషయాలు తెలుసుకోవడంలోనే శాస్త్రవేత్తలు నిమగ్నమయి ఉన్నారు. అందుకే ఈ పరిశోధనల్లో ఏ చిన్న క్లూను కూడా వారు వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. తాజాగా రక్తనాళాల వల్ల మెదడు సంబంధిత వ్యాధులను కనుక్కోవడం సులభం అని వారు కనిపెట్టారు.

- Advertisement -

మెదడులోని రక్తనాళాలను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉండడం వల్ల మార్పులను గమనిస్తూ.. వ్యాధులను ముందుగా కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు గమనించారు. ఉదాహరణకు అల్జీమర్స్ వ్యాధి అనేది ఎంతో ముందుగా మెదడులో ప్రారంభమయినా కూడా వయసు పెరుగుతున్నకొద్దీ లక్షణాలు బయటపడినప్పుడు మాత్రమే ఈ వ్యాధి గురించి కూడా పేషెంట్లకు తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి మెదడులో మొదలయినప్పుడే కనిపెట్టగలిగితే.. దీనికి చికిత్సను అందించడం, దీని వ్యాప్తిని అరికట్టడం మరింత సులభంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో భావిస్తున్నారు. అదే కోణంలో పరిశోధనలు కూడా చేస్తున్నారు.

ఇటీవల వారు చేసిన పరిశోధనల్లో కంటి పరీక్షల ద్వారా, కంటిలో వచ్చే మార్పులను గుర్తించడం ద్వారా కూడా మెదడు సంబంధిత వ్యాధులను ముందస్తుగా కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో పాటు ఇప్పుడు రక్తనాళాలను స్టడీ చేస్తూ ఉండడం వల్ల కూడా మెదడు సంబంధిత వ్యాధులను ముందస్తుగా కనిపెట్టే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. మెదడులో ఉండే రక్తనాళాలు అల్జీమర్స్, పార్కిన్సన్స్, హంటింగ్టన్.. ఇలా ఎన్నో వ్యాధుల గురించి సమాచారాన్ని స్టోర్ చేసుకొని ఉంటుందని తెలిపారు.

ముందుగా ఈ పరిశోధనలను ఎలుకపై చేసిన తర్వాత.. త్వరలోనే మనుషుల్లో చేసి.. ఈ ప్రక్రియతో మనిషికి మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందా లేదా అని కనుక్కోవాలని అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. మెదడులోని సెలిబ్రల్ ఏరియాలో ఉండే రక్తనాళాలలో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది గమనిస్తూ ఉండడం వల్ల.. ఆ మార్పులు ఏ వ్యాధికి కారణమవుతాయని తెలుసుకోవడం సులభమని వారు చెప్తున్నారు. ఈ పరిశోధనలు సక్సెస్ అయిన తర్వాత దానికి అనుగుణంగా చికిత్సను అందించే ఆలోచనలు చేయవచ్చని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News