Big Stories

Light pollution : నక్షత్రాలు ఇక కంటికి కనిపించవు..! 20 ఏళ్లే డెడ్‌లైన్..!

Light pollution

- Advertisement -

Light pollution : కాలుష్యం అనేది కేవలం భూమిని మాత్రమే కాదు.. అంతరిక్షాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా గాలి కాలుష్యం అనేది ఈరోజుల్లో విపరీతంగా పెరిగిపోతోంది. కాలుష్యం, హానికరమైన గ్యాసులు అనేవి భూమిపై ఉన్న గాలిలో సరిపోక అంతరిక్షంలోకి కూడా చేరుకునే రోజులు దగ్గర పడ్డాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పైగా ఈ కాలుష్యం వల్ల పలు పెను మార్పులు రాబోతున్నాయని వారు చెప్తున్నారు. అందులో ఒక మార్పు గురించి వారు తాజాగా బయటపెట్టారు.

- Advertisement -

ప్రస్తుతం భూమిపై నిలబడి చూస్తే నక్షత్రాలు, తోకచుక్కలు లాంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ పెరుగుతున్న కాలుష్యం వల్ల త్వరలోనే ఇవి కనిపించకుండా పోతాయని శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. పెరుగుతున్న లైట్ పొల్యూషనే దీనికి కారణమని వారు చెప్తున్నారు. ఇప్పటికే భూమిపై ఎన్నో రకాలు పొల్యూషన్స్‌తో పాటు లైట్ పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అవసరానికి మించిన కరెంటును ఉపయోగిస్తూ.. ఎక్కువ ఫ్రీక్వెన్సీతో లైట్లు ఉపయోగించడం.. లైట్ పొల్యూషన్ పెరుగుదలకు కారణం.

భూమిపై లైట్ పొల్యూషన్ పెరగడం వల్ల మనుషులు రాత్రిపూట ఆకాశంలోని కాస్మోలను చూడడం ఇకపై సాధ్యపడదని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కాస్మోలు మన కంటికి కనిపించవని అన్నారు. రాత్రిపూట ఆకాశాన్ని చూడడాన్ని, నక్షత్రాలు చూస్తూ ఎంజాయ్ చేయడం చాలామందికి ఇష్టం. కానీ భవిష్యత్తు తరాలకు ఈ సంతోషం దక్కడం కష్టమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదంతా లైట్ పొల్యూషన్ వల్లే అని వాపోతున్నారు. రాత్రిపూట నక్షత్రాలు, కాస్మోలు కనిపించకపోవడం మనల్ని ఒక చీకటి ప్రపంచంలోకి తోస్తుందని హెచ్చరిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా లైట్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా 2016 తర్వాత మిల్కీ వే అనేది చాలామంది కంటికి కనిపించడం ఆగిపోయింది. ప్రతీ ఏడాది లైట్ పొల్యూషన్ కారణంగా ఆకాశంలోని కృత్రిమ వెలుగు 10 శాతం పెరుగుతుందని, దీని వల్ల వెన్నెలను చూసే అవకాశం తగ్గిపోతూ వస్తుందని బయటపెట్టారు. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్న చాలామంది చిన్నప్పుడు ఆకాశం నిండా నక్షత్రాలను చూస్తూ అన్నం తినేవారు కానీ ఇప్పుడు అదే ఆకాశంలో ఎక్కువగా నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణం లైట్ పొల్యూషన్. అందుకే భూమిపైనే కాదు.. ఆకాశంలో కూడా మార్పులు తీసుకువచ్చే ఈ పొల్యూషన్‌కు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News