బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను సొంతపార్టీ కార్యర్తలే ట్రోలింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గా కేటీఆర్ తాను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంలో ట్విట్టర్ స్పేస్‌లో మీటింగ్ పెట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయనకు అర్బన్‌కు రూరల్‌కు కూడా తేడా తెలియదు అంటూ రెచ్చిపోయారు. కేటీఆర్ అర్బన్ ప్రాంతం వరకు ఓకే కానీ ఆయనకు రూరల్ ప్రాంతం గురించి పెద్దగా తెలియదని అన్నారు. కేటీఆర్ మున్సిపాలిటీలు అన్నీ అర్బన్ అనుకుంటాడని, హైదరాబాద్ తప్ప మిగితా ప్రాంతాలు అర్బన్ కాదు అన్న విషయం ఆయనకు అర్థం కాదని, ఆయన అదో రకం అని ట్రోల్ చేశారు.
ఆయన చెన్నూరు పోయి జీడీపీనే మాట్లాడతాడు, గద్వాల పోయి జీడీపేనే మాట్లాడతాడు అంటూ ఎద్దేవా చేశారు. అన్నీ తానే మాట్లాడాలని అనుకుంటాడని ఎవ్వరికీ అవకాశం ఇవ్వడని విమర్శించారు. అంతే కాకుండా మాజీ మంత్రి హరీష్ రావును మెదక్‌కే పరిమితం చేశారని, ఆయనను కట్టడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆయన 8 స్థానాలు గెలుపించుకున్నాడని అన్నారు. రూరల్ ప్రాంతాల్లో తిరగాలంటే కేసీఆర్ వెెళ్లాలని ఆయన వెళ్లనప్పుడు హరీష్ రావును పంపించాలని సూచించారు. కేటీఆర్ ముందు కొంతమంది భజన చేసేవాళ్లు ఉన్నారని వాళ్లు ఎవ్వరినీ కలవనివ్వరు అని అన్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల నిజస్వరూపం ఇదే అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. అన్ననే విమర్శించే స్థాయికి ఎదిగారా..మిమ్మల్ని పార్టీ నుండే సస్పెండ్ చేయాలని కేటీఆర్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు గురించి మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా హరీష్ రావును పార్టీలో పెద్దగా హైలెట్ చేయరని, దూరంగా ఉంచుతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. కానీ సొంతపార్టీ కార్యకర్తలు సైతం అవే కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నేను పాదయాత్ర చేస్తా – KTR
KTR కి అర్బన్ కి రూరల్ కి తేడా తెలియని భాఫూన్ – brs కార్యకర్త pic.twitter.com/EQdCfOn5MS
— Stevenstan😎💛 (@stevenstan49) November 1, 2024