BigTV English

CM Revanth – PM Modi: చీకట్లు తొలగించి.. వెలుగులు నింపుతున్నాం, మోడీకి సీఎం రేవంత్.. దిమ్మతిరిగే రిప్లై

CM Revanth – PM Modi: చీకట్లు తొలగించి.. వెలుగులు నింపుతున్నాం, మోడీకి సీఎం రేవంత్.. దిమ్మతిరిగే రిప్లై

CM Revanth – PM Modi: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వేళ జాతీయ పార్టీల మధ్య ట్వీట్ల వార్ ముదిరి పాకాన పడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ట్వీట్‌పై తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో తాము చేసిన పనులను వివరిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు సీఎం రేవంత్. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన దుష్పరిపాలన సరి చేస్తూ వస్తున్నట్లు రాసుకొచ్చారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ అందులో పేర్కొన్నారు.


తెలంగాణలో బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రెండు వాగ్దానాలను అమలు చేసిందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా  బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు 10 లక్షల వరకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ALSO READ:  కేటీఆర్‌కు అర్బన్‌కు రూరల్‌కు తేడా తెలీదు..బీఆర్ఎస్ కార్యకర్తల షాకింగ్ కామెంట్స్..!

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. రైతుకి భరోసా ఇస్తూ రుణమాఫీని అమలు చేశామన్నారు. దీనిద్వారా దాదాపు 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేశామని వెల్లడించారు. కేవలం 25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని వివరించారు.

భాజపా పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే సిలిండర్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 1.31 కోట్లకు లబ్ది పొందారని వివరించారు. దాదాపు 43 లక్షల మందికి సిలిండర్ పథకం ద్వారా లబ్ది చేకూరిందన్నారు.

మరో స్కీమ్ గురించి వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి. 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఈ విషయంలో మహిళలు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వం దశాబ్ద కాలంగా ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 11 నెలల్లో 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. అందులో గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు ఉన్నాయని వివరించారు. ఇది ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేయని రికార్డుగా వర్ణించారు.

స్కూల్ విద్యార్థులను గత ప్రభుత్వ విస్మరించిందని, దశాబ్దం తర్వాత సంక్షేమ హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతానికిపైగా పెంచామన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నది పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టామన్నారు. దాన్ని పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని రాసుకొచ్చారు.

10 ఏళ్లలో ఆక్రమణలకు గురైన సరస్సులు, చెరువులను పరిరక్షిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక్క చెరువు ఆక్రమణకు గురికాలేదన్న విషయాన్ని నొక్కి వక్కానించారు.

ప్రస్తుతమున్న మూడు నగరాలు కాకుండా  ఫోర్త్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని, మాస్టర్‌ ప్లాన్ ఖరారు కావాల్సి ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.  ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుస్తున్నామని అందులో ప్రస్తావించారు.

 

 

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×