OTT Movie : వాంపైర్ కథలు వినడానికి, చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మనుషుల రక్తం తాగే తోడేళ్ళు, పౌర్ణమి రోజు జరిగే అసాధారణ సంఘటనలతో ఈ స్టోరీలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆడియన్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక హారర్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ పద్దెనిమిదవ శతాబ్ధంలో జరుగుతుంది. ఆ కాలానికి తగ్గట్టు విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇది ఐయండిబిలో 8.4/10 రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘పెన్నీ డ్రెడ్‌ఫుల్’ (penny dreadful) అనేది జాన్ లోగాన్ రూపొందించిన హారర్ టెలివిజన్ సిరీస్. ఇది మార్చి 9న సౌత్ బై సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు వచ్చింది. 2014న ఏప్రిల్ 28న మొదటి సీజన్ విడుదలైంది. 2016 జూన్ 19న మూడవ సీజన్ తర్వాత, ఈ సిరీస్ సృష్టికర్త జాన్ లోగాన్ ‘పెన్నీ డ్రెడ్‌ఫుల్ ముగిసిందని’ ప్రకటించారు. ఇది ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మాల్కమ్ అనే వ్యక్తి , తన కూతురు మీనాను వాంపైర్‌లు ఎత్తుకెళ్లారని తెలుసుకుని ఆమెను వెతకడం మొదలుపెడతాడు. అతనికి సాయం చేయడానికి వానెసా ఐవ్స్, ఇథాన్ చాండ్లర్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. వీళ్ళల్లో వానెసా ఐవ్స్ అనే యువతికి, చనిపోయిన వాళ్ల ఆత్మలతో మాట్లాడగల పవర్ ఉంటుంది. కానీ ఒక డ్రాక్యులా ఆమె శరీరంలోకి రావాలని చూస్తుంటాడు. ఇథాన్ చాండ్లర్ పౌర్ణమి రోజు వూల్ఫ్ గా మారే పవర్ ఉంటుంది. వీళ్లు కలిసి మీనాను వెతుకుతూ వాంపైర్ స్థావరాలలో ఫైట్ చేస్తారు.
Read Also : బ్రూటల్ మర్డర్స్… అమ్మాయిల బట్టల వాసన చూస్తూ ఆ పాడు పని చేసే సైకో… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు
ఒక రోజు మీనా వాంపైర్‌లతో ఉందని వానెసా తెలుసుకుంటుంది. వాంపైర్ క్వీన్ మీనాను కిడ్నాప్ చేసి ఉంటుంది. ఇప్పుడు మీనా కోసం వాంపైర్ డెన్‌లో పెద్ద ఫైట్ జరుగుతుంది. అయితే మినా వాంపైర్‌గా మారి భయంకరంగా మారుతుంది. వానెసా వాంపైర్ క్వీన్ తో తీవ్రంగా ఫైట్ చేసి ఓడిస్తుంది. మాల్కమ్, ఇథాన్ లు కూడా ఒక భయాంకరమిన డ్రాక్యులాతో పోరాడుతారు. చివరికి వీళ్ళు వాంపైర్‌లను ఒడిస్తారా ? వాంపైర్ క్వీన్ మీనాను ఎందుకు కిడ్నాప్ చేస్తుంది ? డ్రాక్యులాతో ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను, ఈ హారర్ ఫ్యాంటసీ సిరీస్ ను చూసి తెలుసుకోండి.