BigTV English

Chanakya Niti : ఇటువంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే.. అదృష్టం మీ వెంటే..!

Chanakya Niti : ఇటువంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే.. అదృష్టం మీ వెంటే..!

Chanakya Niti : ప్రపంచానికి రాజకీయం, ఆర్థిక శాస్త్రం, దౌత్య విధానాలలో అపారమైన జ్ఞానాన్ని అందించిన మేధావి ఆచార్య చాణక్యుడు. అంతే కాకుండా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో చెప్పిన మహానుభావుడు. తన చాణక్యనీతి ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేసిన ఆధ్యాత్మిక వేత్త.


ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. చంద్రగుప్త మౌర్యుడుని రాజుగా చేయడంలో చాణక్యుడు కీలకపాత్ర పోషించాడు. చాణక్యుడుని అనుసరించిన వ్యక్తి జీవితంలో విఫలం చెందలేదు. చాణక్యుడు చెప్పిన విషయాలు కొన్ని కఠినంగా ఉన్నప్పటికీ.. ఆ విషయాలు మంచి చేసేవే. చాణక్యుడు మీ జీవాతాన్ని విజయం వైపు నడపిస్తాడు.

చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్న వారు అదృష్టవంతులు అవుతారట. ఆ స్త్రీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.


  • చాణక్యుడు స్త్రీలను చాలా సున్నితమైన వారుగా పేర్కొన్నారు. వారు సంతోషమైనా లేదా విచారమైనా మొదట ఏడుస్తారు. ఇటువంటి స్త్రీలు ఇతరుల కంటే తక్కువేమి కాదు. వీరి పాత్ర కాస్త విచిత్రంగా ఉంటుంది. సున్నితమైన మనస్తత్వం కలిగిన స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు అదృష్టవంతులని చాణక్యుడు తెలిపారు.
  • పురుషులకంటే స్త్రీలకు మానసికంగా ఎక్కువ బలం ఉంటుందని చాణక్యుడు అన్నాడు. ఒక స్త్రీ చిన్న కష్టాలకే ఏడిస్తే ఆమె మనసు చాలా మంచిది. పురుషులు అలాంటి స్త్రీలను గౌరవించాలి. అలాంటి స్త్రీలు తమ జీవితంలో ఎటువంటి కష్ట, నష్టాలు వచ్చినా.. సహనం కలిగి ఉంటారు. ఏడ్చే స్త్రీలు తమ భర్త లేదా ప్రేమికునికి దూరంగా ఉండలేరు. ఇటువంటి స్త్రీలు.. కుటుంబానికి చాలా మంచిదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీలను కోల్పోకూడదని వివరించారు.
  • చాణక్యుడి ప్రకారం.. ఏ తప్పు లేకుండా ఏడ్చే స్త్రీ.. మాతృ భావన కలిగి ఉంటుంది. ఇలా ఏడ్చే స్త్రీ కుటుంబ సభ్యులతో బాగా కలిసి పోతుంది. స్త్రీలు ఏడవటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఏడ్చే స్త్రీలు ఎప్పుడు ఇతరుల భావాలను గౌరవిస్తారు. ఆకలితో ఇంటికి వచ్చిన వారికి ఆహారం ఇవ్వకుండా నిద్రపోరు. ఎవరినీ ఆకలితో కూడా ఉండనివ్వరు. ఇటువంటి స్త్రీలను గౌరవిస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వారిని కించపరచకూడదు.
  • వివాహం చేసుకున్న స్త్రీ ప్రవర్తన సరిగా లేకుంటే కుటుంబ పరువు మొత్తం పోతుంది. అలాంటి స్త్రీని విడిచి పెడ్డటం మంచిదని చాణక్యుడు అన్నారు. అలానే తప్పుడు ఆలోచన కలిగిన స్త్రీ స్నేహం జీవితాన్ని నాశనం చేస్తుందన్నాడు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×