Big Stories

Coconut Tradition : కలశంపై పెట్టిన కొబ్బరికాయను ఇలా చేస్తున్నారా….

Coconut Tradition : వ్రతాలు, నోములు వంటి పూజాకార్యక్రమాలోనూ, అలాగే దేవాలయాలలో జరిగే దైవ కార్యాలలో కలశ ధారణ అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ సమయంలో వెండి చెంబును లేదా రాగి చెంబును కలశంగా ఉపయోగిస్తారు. కలశం కోసం రాగిచెంబు లేదా వెండి చెంబును తీసుకోని దానికి పసుపు,కుంకుమ రాయాలి. కలశంలో కొంచెం నీటిని పోసి, అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయ చుట్టూ ఒక వస్త్రాన్ని చుడతారు .పూజ తర్వాత కలశాన్ని ఏం చేయాలన్న దానిపై రకరకాల అభిప్రాయాలున్నాయి.

- Advertisement -

కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను నీటిప్రవాహం లో నిమజ్జనం చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు.. ఇంటికి దగ్గర్లో నీటి ప్రవాహం లేనట్లయితే , ఏదైనా జలాశయంలో లేదా బావిలో నిమజ్జనం చేయవచ్చు అని చెబుతున్నారు.. ముఖ్యంగా నోములు, వ్రతాలు చేసే సమయంలో పీటపై పోసిన బియ్యంను బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు.. కాబట్టి ఆ బియ్యంతో పాటు కలశం మీద ఉంచిన కొబ్బరికాయను కూడా బ్రాహ్మణులకు ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు.

- Advertisement -

ఇక కొబ్బరికాయకు వస్త్రాన్ని చుట్టి పూజ అయిన తరువాత, దేవాలయాల్లో అయితే పూర్ణాహుతికి వాడుతుంటారు.. ఇళ్లల్లో అయితే కొబ్బరికాయలను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా నీళ్ళలో నిమజ్జనం చేయడం వంటివి చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ ఆచారం మన పూర్వీకుల నుంచి వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News