BigTV English

Mouth Wash : ప్రకృతి ప్రసాదించిన మౌత్‌ వాష్‌లు ఇవే

Mouth Wash : ప్రకృతి ప్రసాదించిన మౌత్‌ వాష్‌లు ఇవే

Mouth Wash : నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దంతాల్లో నొప్పి, చిగుర్ల సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక నోటి దుర్వాస‌న కూడా అధికంగా వస్తుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి. అంతేకాకుండా మౌత్‌వాష్‌లను కూడా వాడుతూ ఉండాలి. మార్కెట్‌లో రసాయ‌నాల‌తో చేసిన ఎన్నోరకాల మౌత్‌వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులు ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధమైన ప‌దార్థాల‌తో మౌత్ వాష్‌ల‌ను త‌యారు చేసుకోవచ్చు. దీనివల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి స‌మ‌స్యలు కూడా ఉండవు. కొబ్బరి నూనె స‌హ‌జ‌సిద్ధమైన మౌత్ వాష్‌గా ప‌నిచేస్తుంది. దీనిలోని యాంటీ వైర‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ ల‌క్షణాల వ‌ల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. నోటి దుర్వాస‌న కూడా త‌గ్గుతుంది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని నోట్లో పోసుకుని పావుగంటపాటు బాగా పుక్కిలించాలి. తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే నోరు శుభ్రంగా మారుతుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్యలు పోతాయి. అరగ్లాస్‌ గోరువెచ్చని నీటిలో అరస్పూన్‌ ఉప్పు కలిపి దాన్ని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించినా నోరు శుభ్రంగా మారుతుంది. మార్కెట్‌లో దొరికే మౌత్‌వాష్‌ల కంటే కూడా ఉప్పు బాగా పనిచేస్తుంది. అర క‌ప్పు నీటిలో అంతే మోతాదులో క‌ల‌బంద ర‌సం క‌లిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు పోతాయి. దంతాల మధ్య పేరుకున్న పాచికూడా పోతుంది. నోరు శుభ్రం అవడంతో పాటు దుర్వాస‌న త‌గ్గుతుంది. క‌ప్పు నీటిలో 10 చుక్కల దాల్చిన చెక్క నూనె, 10 చుక్కల లవంగాల నూనె క‌లిపి మిశ్రమాన్ని త‌యారు చేయాలి. దాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీని వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంత క్షయం కూడా తగ్గుతుంది. దీన్ని ఎక్కువ తయారుచేసుకుని సీసాలో నిల్వకూడా చేసుకోవచ్చు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×