E-Paper
Advertisement

Top 20 News: జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్…సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

Top 20 News: జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్…సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

1. నేను మాట్లాడటం ప్రారంభిస్తే చాలామంది నోళ్లు మూతబడతాయి

నెల్లూరులో మేయర్ స్రవంతి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టారని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మాట్లాడాల్సిన సమయం వస్తే తప్పకుండా మాట్లాడతానన్నారు కోటంరెడ్డి. తాను మాట్లాడటం ప్రారంభిస్తే చాలామంది నోళ్లు మూతపడతాయని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులు తన సమాధానం చెప్పే పరిస్థితి రాకుండా కోరుకుంటే మంచిదన్నారు కోటంరెడ్డి.

2. మా ఇంటిని డంపింగ్ యార్డ్ చెయ్యద్దు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుం బాధ పంచాయతీ మండవారు గరువులో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయద్దు అంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో సంఘటనా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా డంపింగ్ యార్డు నివాసాల మధ్య ఏర్పాటు చేయవద్దంటే నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటును గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తీరుకు నిరసనగా టెంట్ వేసి వంటా _ వార్పు కార్యక్రమం నిర్వహించారు.

3. జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్లు దాఖలు చేశారు అత్యంత వెనుకబడిన కుల సంఘాలు. అత్యవసర పిటిషన్ కింద విచారణ నిర్వహించాలన్నారు న్యాయవాది సుదర్శన్. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. బీసీలలో ఏ, బీ, సీ, డీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు న్యాయవాది.

4. ఏరోస్పేస్ హబ్ గా హైదరాబాద్

హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ ‘ఇన్ఫినిటీ క్యాంపస్‌’ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. దేశంలో తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ అయిన ‘విక్రమ్-1’ను మోడీ ఆవిష్కరించారు. భారత అంతరిక్ష రంగంలో ఇది మైలురాయిగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. సైకిల్‌పై రాకెట్ మోసుకెళ్లిన స్థితి నుంచి ప్రారంభమైన భారత ప్రస్థానంలో, యువశక్తికి స్కైరూట్ గొప్ప ప్రతీక అన్నారు.

5. పులుల సంరక్షణలో తెలంగాణ ముందడుగు

రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని అర‌ణ్యభవన్‌లో స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించింది ప్రభుత్వం. ఈ చ‌ర్య పులులను ప‌రిర‌క్షించేందుకు పెద్ద ఎత్తున ఉప‌యోగ‌ప‌డ‌నుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ జిల్లాల వారీగా, విడివిడిగా పులుల కదలికలను గమనిస్తుండగా.. తెలంగాణ మాత్రం మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేసే సెంట్రలైజ్‌డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం స‌ర్వత్రా హ‌ర్షం వ్యక్తమవుతుంది.

6. సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు భారీ సైబర్ క్రైమ్ కేసును చేధించారు. అంతర్జాతీయ స్థాయి సంబంధాలు ఉన్న ముఠాను అరెస్టు చేశారు. భీమవరంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగించి 78 లక్షలు రూపాయలు కాజేసిన 13 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. రికార్డు స్థాయిలో 61 లక్షల రూపాయలు రికవరీ చేశామన్నారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ.

7. మోటార్లు, కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లిన దుండగులు

సిద్దిపేట జిల్లా ఆకారం గ్రామ శివారులోని కూడవెళ్లి వాగు వద్ద చోరీ జరిగింది. వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు, కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు దుండగులు. పొలాలకు నీరు పెట్టడానికి వెళ్ళిన రైతులు ఈ చోరీని గుర్తించి ఆందోళన చెందారు. దీనిపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

8. మద్యం సేవించి వాహనం నడిపిన యువకుడు మృతి

అన్నమయ్య జిల్లా ఎర్రపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్నేహితుని పుట్టినరోజు వేడుకలో పాల్గొని, మద్యం సేవించి బైక్‌పై రాజంపేట నుంచి నందలూరుకు తిరిగి వస్తున్న ఇద్దరు యువకులు ట్రాఫిక్ సూచిక స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో అరవపల్లి తోటపల్లికి చెందిన కనకయ్య అక్కడికక్కడే మృతి చెందగా, జగదీష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

9. బీసీ రిజర్వేషన్ కేవలం “డ్రామా”

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ కేవలం “డ్రామా” అని, 42 శాతానికి సగం కూడా రిజర్వేషన్ ఇవ్వలేకపోయారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల చదువులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని కాంగ్రెస్, రిజర్వేషన్ ఇస్తుందా అని ఎద్దేవా చేశారు.

10. నవంబర్ 29న సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ‘దీక్షా దివస్’ కార్యక్రమం

రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ నవంబర్ 29న సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ‘దీక్షా దివస్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఉద్యమంలో పాత్ర లేనివారు.. నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ సాధించామని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ, గులాబీ జెండా ఉంటాయని ఆయన స్పష్టంచేశారు.

11. ఆరు నెలల్లో రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి

కృష్ణా జిల్లా గుడివాడలో రైల్వేగేట్లపై నిర్మిస్తున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు ఆరు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి ప్రకటించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఆయన ఆర్ఓబీ నిర్మాణ పనులను పరిశీలించారు. 70% పనులు పూర్తయ్యాయని, 20 కోట్లతో మెయిన్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

12. మరోసారి కస్టడీలోకి ఇబొమ్మ రవి

ఐబొమ్మ కేసులో రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి అతడిని బషీర్‌బాగ్ సీసీఎస్‌కు తరలించారు. విచారణకు సహకరించకపోవడంతో, గతంలో ఐదు రోజుల కస్టడీ తర్వాత, మరో మూడు రోజుల పాటు విచారించనున్నారు.

13. ఎఐ టెక్నాలజీ తో కొత్త డ్రోన్లు

హైదరాబాద్‌కు చెందిన ఇంద్రజాల్ డిఫెన్స్ సంస్థ, దేశంలోనే మొట్టమొదటి ‘యాంటీ డ్రోన్ పాట్రోల్ వెహికల్’ అయిన ఇంద్రజాల్ రేంజర్‌ను ఆవిష్కరించింది. ఎఐ ఆధారంగా పనిచేసే ఈ వాహనం గస్తీ కాస్తున్నప్పుడే చుట్టూ 10 కి.మీ. దూరంలోని శత్రు డ్రోన్లను గుర్తించి, హ్యాకింగ్, జామింగ్ ద్వారా నిర్వీర్యం చేస్తుంది. ఇది మన రక్షణ రంగంలో కీలక ముందడుగు అని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే పేర్కొన్నారు.

14. ఉత్పత్తి చేస్తేనే జీతం

విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికులు పోరుబాట పట్టారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జీతాల చెల్లింపులను ఉత్పత్తితో ముడిపెడుతూ.. జారీ చేసిన సర్క్యులర్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సొంత గనులు కేటాయించాలని అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా నిర్వ హించారు.

15. విజయవాడలో డేవిడ్ బేక్‌హామ్

విజయనగరం జిల్లాలో ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బేక్‌హామ్ సందడి చేశారు. జమ్మాదేవిపేట బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి.. బాలికల నైపుణ్యాలు, స్కూల్ పరిసరాలను పరిశీలించారు. అలాగే, విద్యార్థినులతో కాసేపు ఫుట్‌బాల్ ఆడారు. ఈ క్రమంలో బెక్‌హామ్‌కు మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. బెక్‌హామ్ మాటలు, ప్రోత్సాహం, ఎనర్జీ విద్యార్థుల్లో ఉల్లాసాన్ని నింపిందని ట్వీట్ చేశారు.

16. హైడ్రపై సీరియస్ అయినా హై కోర్ట్

హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో.. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని.. FTL నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారని.. హద్దుల విషయంలో ఎందుకు సర్వే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

17. సుమత్రా దీవుల్లో భూకంపం

ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటికే కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్న ఆ దేశాన్ని ఈ పెను ప్రకృతి విపత్తు మరింత వణికించింది. ఈ భూకంపం వల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

18. పౌరులు కానివారికి ఓటు హక్కు ఉండదు

భారతదేశంలో చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు కానివారికి ఆధార్ ఉన్నందున ఓటు హక్కు కూడా ఇవ్వాలా అని ప్రశ్నించింది. పౌరసత్వానికి ఆధార్ రుజువు కాదు అని స్పష్టం చేస్తూ, సంక్షేమ ప్రయోజనాల కోసమే దీన్ని ఏర్పాటు చేశారని కోర్టు పేర్కొంది. ఓటరు నమోదు వివరాలు సరిచూసుకునే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది.

19. మా కుటుంభం మళ్లీ కలుస్తుంది: మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మి తన కుటుంబ వివాదాలపై స్పందించారు. తన కుటుంబం మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నానని, ఎన్ని వివాదాలు వచ్చినా రక్త సంబంధీకులు మాత్రమే మిగులుతారని అన్నారు. కుటుంబ కలహాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని, వాటిని చూసి షాక్ అయ్యానని చెప్పారు. తన బాధను బయటివారికి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నానని తెలిపారు.

20. ధురంధర్ రన్‌టైమ్‌పై చర్చ

బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్న ‘ధురంధర్’ చిత్రం రన్‌టైమ్‌పై చర్చ జరుగుతోంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా నిడివి 3.32 గంటలుగా ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది అత్యంత నిడివి ఉన్న చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. అయితే ఈ చిత్రం మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ కాదని దర్శకుడు ఆదిత్య ధర్ స్పష్టం చేశారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×