E-Paper
Advertisement

Contact lens : కాంటాక్ట్ లెన్స్‌లలో మైక్రోప్లాస్టిక్స్ గుర్తింపు.. భారీ మోతాదులో..

Contact lens : కాంటాక్ట్ లెన్స్‌లలో మైక్రోప్లాస్టిక్స్ గుర్తింపు.. భారీ మోతాదులో..
Advertisement
 contact lenses..

Contact lens : ప్లాస్టిక్స్ అనేవి ప్రాణాలకు, పర్యావరణానికి హానికరం అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నా.. మనుషులు మాత్రం వాటి వినియోగాన్ని పూర్తిగా మానుకోలేకపోతున్నారు. ప్లాస్టిక్స్ స్థానంలో ఎన్ని ప్రత్యామ్నాయాలను కనిపెట్టినా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే భూగ్రహంపై పెరుగుతున్న ఎన్నో సమస్యలతో పాటు ప్లాస్టిక్స్ మరో తీవ్రమైన సమస్యగా మారాయి. దీంతో పాటు కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్స్ అనేవి మానవాళికి మరింత తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లమంది కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తున్నారు. ఒకసారి వినియోగించే పడేసే లెన్స్‌లను కొందరు ఉపయోగిస్తే.. మళ్లీ మళ్లీ ధరించే విధంగా ఉండే లెన్స్‌లపై మరికొందరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ లెన్స్‌లు అనేవి ఎక్కువకాలం వినియోగించే అవకాశం ఉండదు. కొన్ని నెలల తర్వాత అయినా వాటిని మార్చుకోవాల్సిందే. తాజాగా ఎక్కువకాలం ఉపయోగించిన కాంటాక్ట్ లెన్స్‌పై శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించారు. ఎక్కువకాలం పాటు సన్‌లైట్‌కు ఎక్స్‌పోజ్ అయిన లెన్స్‌లు ప్లాస్టిక్‌ను అట్రాక్ట్ చేస్తాయని తెలుసుకున్నారు.

మైక్రోప్లాస్టిక్స్ అనేవి పర్యావరణానికి, మనుషులకు హాని కలిగిస్తాయని మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ అవి ఏయే విధాలుగా నష్టం కలిగిస్తాయి అనే విషయాన్ని వారు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. నీటిలో మాత్రం మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులోని జీవాలకు, ఆ నీరు తాగే మనుషులకు కూడా దాని ప్రభావం ఉంటుందని వారు ఇప్పటివరకు తెలుసుకున్నారు. తాజాగా కాంటాక్ట్ లెన్స్‌లలో కూడా మైక్రోప్లాస్టిక్ ఉందని తెలియడంతో వారు షాకయ్యారు. అసలు దాని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు మొదలుపెట్టారు.

Advertisement

కాంటాక్ట్ లెన్స్‌లపై ప్రయోగాల కోసం ఆరు వేర్వేరు కంపెనీల నుండి కంటెక్ట్ లెన్స్‌లను శాస్త్రవేత్తలు సేకరించారు. వీటన్నింటిని కొంతకాలం పాటు సన్‌లైట్‌లో ఉంచారు. ఆ తర్వాత వాటిలో మైక్రోప్లాస్టిక్స్ ఆనవాళ్లను గమనించారు. మ్యానువల్‌గా కాకుండా సిస్టమ్ ద్వారా అవి మైక్రోప్లాస్టిక్స్ అని తొందరగా తెలుసుకోవడం సాధ్యమయ్యిందని అన్నారు. రోజుకు 10 గంటల పాటు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నా కూడా సంవత్సరం లోపు అందులో దాదాపు 90 వేల మైక్రోప్లాస్టిక్స్ చేరుతాయని వారు అంచనా వేస్తున్నారు. అందుకే కాంటాక్ట్ లెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×