BigTV English
Advertisement

Donating pumpkin:- సంక్రాంతి రోజు గుమ్మడిపండు దానం చేస్తే చాలు

Donating pumpkin:- సంక్రాంతి రోజు గుమ్మడిపండు దానం చేస్తే చాలు

Donating pumpkin on Sankranti day is enough :-

మకర సంక్రాంతి రోజున దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు పోతాయని విశ్వాసం. స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లుల తీర్చిదిద్దుకోవాలి.


అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పండుగ రోజు ఎవరైనా మనల్ని దానం అడిగితే తప్పకుండా వారికి మనకు తోచినంత దానం చేయాలి.సంక్రాంతి పండుగ రోజు ఈ విధంగా దానం చేయటం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.ఇంటికి వచ్చే హరిదాసు, బసవన్నలకు ధాన్యాలను దానధర్మాలు చేయడం ద్వారా గత జన్మ దారిద్య్రాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.

నువ్వులను దానం చేస్తే శని దోషం తొలగిపోతుంది. ఈ దానం ద్వారా మనస్తాపాలు తొలిగిపోయి ఆరోగ్యం కలుగుతుంది. ఈ దానం ద్వారా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. నువ్వులను దానం చేస్తే శరీరంలోని మాంసదోషం కూడా తొలగుతుంది. పండుగ రోజు బెల్లం దానం చేస్తే సంతానం కలుగుతుంది. వంశం వృద్ధి చెందుతుంది. సంక్రాంతి వేళనే భూమిని శ్రీహరి సముద్రం నుంచి పైకి తీసుకువచ్చాడు. దాన్ని గుర్తు చేయడానికే సంక్రాంతి పండుగ జరుపకుంటాం. అలాగే భూదానం ఫలితాన్నిపొందడానికి కూడా నువ్వులు, బెల్లం దానం ఇవ్వాలి. తలస్నానం చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం.


Follow this link for more updates:- Bigtv

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×