BigTV English

Drones:కొత్త పద్ధతిలో డ్రోన్ల తయారీ.. డిఫెన్స్ కోసం..

Drones:కొత్త పద్ధతిలో డ్రోన్ల తయారీ.. డిఫెన్స్ కోసం..

Drones:నేలపై నడిచేదాని దగ్గర నుండి ఆకాశంలో ఎగిరేదాని వరకు ప్రతీ పరికరంలో టెక్నాలజీనే సాయంగా ఉంటోంది. అంతే కాకుండా నిన్న ట్రెండింగ్‌లో ఉన్న టెక్నాలజీ స్థానంలో ఈరోజు మరొకటి వచ్చేస్తోంది. శాస్త్రవేత్తలు ఈ విషయంలో పోటాపోటీగా పరిశోధనలు చేస్తున్నారు. ఇక తాజాగా గాలిలో ఎగిరే ఒక కొత్త పరికరాన్ని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది ప్రత్యేకంగా డిఫెన్స్ రంగంలో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.


ప్రతీ దేశంలో డిఫెన్స్ విభాగం అనేది ఎంతో ముఖ్యం. అది ధృడంగా ఉంటేనే దేశమంతా సురక్షితంగా ఉంటుంది. అందుకే డిఫెన్స్‌లో కూడా కొత్త రకమైన టెక్నాలజీలను కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కష్టపడుతున్నారు. ఇటీవల ఇద్దరు ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు కలిసి మనిషి లేకపోయినా గాలిలోకి ఎగిరే ఒక చిన్న సైజ్ విమానాన్ని కనిపెట్టారు. ముందుగా దాని పేపర్ డిజైన్‌ను తయారు చేసి.. ఆ తర్వాత రెండు నెలల్లోనే దానిని గాలిలోకి ఎగరేసి చూపించారు. వారు కనిపెట్టిన ఈ పరికరం ఇతరులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల డిఫెన్స్ రంగంలో డ్రోన్లు కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ఇటీవల శాస్త్రవేత్తలు తయారు చేసిన వాహనం కూడా డ్రోన్ లాగానే ఉన్నా.. దానికంటే సైజ్‌లో కొంచెం పెద్దగా ఉంటుంది. గతేడాది ఆగస్ట్‌లో మొదటిసారి ఈ పెద్ద సైజ్ డ్రోన్లు తయారు చేయాలనే ఆలోచన వారికి వచ్చిందన్నారు. సెప్టెంబర్‌లోపు ప్రభుత్వం అనుమతితో దాని పేపర్ వర్క్‌ను పూర్తి చేశామని తెలిపారు. ఇక నవంబర్ వచ్చేసరికి ‘వాండరర్’ అని పిలవబడే ఈ పెద్ద సైజ్ డ్రోన్ గాలిలోకి సక్సెస్‌ఫుల్‌గా ఎగిరిందని చెప్పారు.


అతి తక్కువ సమయంలోనే ఇలాంటి ఒక పరికరాన్ని తయారు చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా అంటోంది. అంతే కాకుండా తక్కువ సమయంలో కూడా ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపింది. ఇప్పటికే డిఫెన్స్‌లో పనిచేయడానికి వాండరర్ 80 శాతం సిద్ధంగా ఉందని, మరికొన్ని పరిశోధనలు చేసిన తర్వాత దానిని డిఫెన్స్‌కు అందిస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి మరింత వేగంగా పనిచేసేలా ఉండాలని వారు తెలిపారు.

2023 మధ్యలోపు వాండరర్‌ను డిఫెన్స్‌ను అందించాలని శాస్త్రవేత్తలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఒక వాండరర్‌ను తయారు చేయడానికి 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని వారు తెలిపారు. ఇది నాలుగు మీటర్ల పొడవైన రెక్కలతో 1300 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని వారు అన్నారు. భూమికి 1,525 మీటర్ల ఎత్తువరకు ఎగురుతూ కనీసం 2 కిలోల బరువును మోయగలదని వారు చెప్పారు. అంతే కాకుండా ఇవి మనుషులు సహాయం లేకుండానే ఎగరగలవని బయటపెట్టారు.

Blood Easily:క్యాన్సర్‌ను మరింత సులువుగా గుర్తించవచ్చు!..

Color Changing:ఇంటి వాతావరణాన్ని కంట్రోల్ చేసే కలర్..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×