BigTV English

E SIM is Very Safe :’ఈ-సిమ్’ చాలా సేఫ్!

E SIM is Very Safe :’ఈ-సిమ్’ చాలా సేఫ్!

E SIM is Very Safe :ఈ–సిమ్‌. ఇదేంటని అనుకుంటున్నారా? ఈ–సిమ్‌ అంటే… ఇప్పుడు మన ఫోన్లలో వాడుతున్న ఫిజికల్‌ సిమ్‌కు డిజిటల్‌ రూపం. అంటే ఫోన్లో ప్రత్యేకంగా సిమ్ వేయాల్సిన అవసరం లేకుండా… నేరుగా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా, పర్సనల్‌ ఐడెంటిఫియబుల్‌ ఇన్ఫర్మేషన్‌తో రిజిస్టర్‌ చేసుకుని… నెంబర్ యాక్టివేట్‌ చేసుకోవచ్చు. ఈ–సిమ్‌ అకౌంట్‌ను భద్రంగా ఉంచుకోవడానికి ఫేస్‌ ఐడీ లేదా బయోమెట్రిక్‌ పాస్‌వర్డ్‌ పెట్టుకోవచ్చు. ఒకరు ఈ–సిమ్‌ వాడుతున్నప్పుడు, మరొకరు సిమ్‌ పోయిందనో, పాడైపోయిందనో నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయడానికి… అదే నంబర్‌తో మరో సిమ్‌ను తీసుకోడానికి… అస్సలు ఛాన్సుండదు. ఎవరైనా అలా చేస్తే… వాళ్లను సైబర్‌ నేరగాళ్లుగా భావించి పట్టుకునేందుకు వీలుంటుంది. ఇప్పుడు అమెరికాలో వాడే ఐఫోన్‌–14 మోడల్స్‌కు సిమ్‌ స్లాట్స్‌ లేవు. అవి ఈ–సిమ్‌ను మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి. కొన్నేళ్ల కిందటే ఈ-సిమ్ మార్కెట్‌లోకి వచ్చినా, మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలీదు. సైబర్ మోసాలు ఇటీవల భారీగా పెరిగిపోవడంతో… ఇప్పుడిప్పుడే దేశీయ టెలికాం సంస్థలు కూడా ఈ-సిమ్ సేవలు అందిస్తున్నాయి.


ఈ-సిమ్‌ను ఈజీగా యాక్టివేట్/డీయాక్టివేట్ చేయొచ్చు. అలాగే మల్టిపుల్ ఫోన్ నెంబర్లు, ప్లాన్లను ఒకే స్మార్ట్ ఫోన్లో వాడుకోవచ్చు. ఈ-సిమ్‌ను పోగొట్టుకోవడం, పాడవడం, దొంగిలించడం సాధ్యం కాదు. అంతేకాదు… వివిధ నెట్‌వర్క్‌లకు, ప్లాన్లకు సులువుగా మారవచ్చు. దాని కోసం నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ స్టోర్‌కు వెళ్లే అవసరం కూడా ఉండదు. ఎస్‌ఎమ్‌ఎస్, ఈ–మెయిల్‌ ద్వారానే యాక్టివేట్‌ చేయవచ్చు. దేశంలో ఐఫోన్, శామ్‌సంగ్, హానర్, గూగుల్‌ పిక్సెల్, సోనీ, షావోమీ, నోకియా, మొటొరోలా తదితర కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లు మాత్రమే… ఈ–సిమ్‌ను సపోర్టు చేస్తున్నాయి.

2016లో ఈ-సిమ్‌ను తొలిసారిగా శామ్‌సంగ్‌ గేర్‌ S2 3G స్మార్ట్‌ వాచ్‌ కోసం రూపొందించారు. 2017లో ఆపిల్ కూడా తన స్మార్ట్‌ వాచ్‌లో దీన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పలు స్మార్ట్‌ ఫోన్ తయారీ కంపెనీలు… ఈ–సిమ్‌ను సపోర్ట్ చేసేలా స్మార్ట్ ఫోన్లు తయారు చేశాయి. దాంతో… పలు టెలికాం సంస్థలు ఈ–సిమ్‌ సేవలను ప్రవేశ పెట్టాయి. ఇప్పుడు ఇండియాలో ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్‌–ఐడియా ఈ–సిమ్‌ సేవలను అందిస్తున్నాయి. సో, సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే… వెంటనే ఈ-సిమ్‌కు మారిపోవడం బెటర్.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×