BigTV English

Budget Allocation:టెక్ వరల్డ్‌కు 16 వేల కోట్ల బడ్జెట్.. సరిపోదంటున్న నిపుణులు..

Budget Allocation:టెక్ వరల్డ్‌కు 16 వేల కోట్ల బడ్జెట్.. సరిపోదంటున్న నిపుణులు..

Budget Allocation:భారత ప్రభుత్వం తాజాగా 2022-23 సంవత్సరానికి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.16,361 కోట్ల బడ్జెట్‌ను అందించింది. కానీ ఇది బడ్జెట్‌లో కేవలం 0.36 శాతమే అని, ఇది సరిపోదని నిపుణులు విమర్శిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకుంటున్న భారత పరిశోధకులకు ఇది ఆశాదాయకంగా ఉండదని వారు అంటున్నారు.


గతేడాది భారత బడ్జెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.14,217 కోట్లు అందించింది. దానితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని కొందరు ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.7,931 కోట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి రూ.2,683.86 కోట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు రూ.5,746.51 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. గతేడాది ఇన్‌ఫ్లేషన్ 5.13 శాతంగా ఉంది. అందుకే ఇన్‌ఫ్లేషన్‌ను తగ్గించడానికి బడ్జెట్ కొంచెం ఎక్కువగా కేటాయించాల్సిందని సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం కూడా బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగులను పెంచాలని, వారికి ఆదాయం పెరిగేలా చేయాలని అనుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఇలాంటి బడ్జెట్ కేటాయించడం కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆధారపడాలని అనుకుంటున్న సమయంలో ఈ బడ్జెట్‌ను గమనించి వనరులను ఏర్పాటు చేసుకోవాలని పరిశోధకులు అనుకుంటున్నారు.


Netflix:పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు..! నెట్‌ఫ్లిక్స్ రూల్..

Science and Technology:సైన్స్ అండ్ టెక్నాలజీలో కొరియా ఫ్యూచర్ ప్లాన్..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×