E-Paper
Advertisement

University of Hyderabad : ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే..?

University of Hyderabad : ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే..?
Advertisement

University of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 76 పోస్టులకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఎకనామిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసి ఉండాలి. నెట్‌/ స్లెట్‌/ సెట్‌ లో ఉత్తీర్ణత సాధించాలి. బోధన లేదా పరిశోధనలో అనుభవం ఉండాలి. అభ్యర్థులను అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement

మొత్తం పోస్టులు : 76
ప్రొఫెసర్లు : 21
అసోసియేట్‌ ప్రొఫెసర్లు : 33
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు : 17
వయో పరిమితి : 65 ఏళ్లు మించకూడదు

పే స్కేల్ : నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 – రూ.2,18,200
అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400- రూ.2,17,100
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700 – రూ.1,82,400
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 31/05/2023
దరఖాస్తుల హార్డ్‌కాపీకి చివరి తేదీ : 09/06/2023

Advertisement

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×