BigTV English

Fasting on Ekadashi: ఏకాదశి నాడు ఉపవాసం చేయాలా…

Fasting on Ekadashi: ఏకాదశి నాడు ఉపవాసం చేయాలా…

Fasting on Ekadashi:సంవత్సరంలోని 12 నెలల్లో నెలకి రెండు చోప్పున 24న ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశల్లో ఉపవాసం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి నాడు భోజనం చేస్తే అది ఆ ఆహార పదార్ధాలన్నీ ఒక రాక్షసునికి సంబంధించినవని పురాణాలు చెబుతున్నాయి.


బ్రహ్మ సృష్టిని నిర్మించే క్రమంలో ఆయన నుదుటి నుంచి ఒక చెమట బిందువు రాలి కింద పడిందట. సృష్టించే వారికే ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ చెమట చుక్కలో నుంచి పుట్టిన రాక్షసుడు బ్రహ్మదేవా నా ఆహారమేంటని అని అడిగాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక క్షణం ఆలోచించి ఏకాదశినాడు ఎవరైనా ఆహార పదార్ధాన్ని స్వీకరిస్తారో… ఆ ఆహార పదార్థమంతా నీదే అని చెప్పాడట.

అది మొదలు సంప్రదాయం నుంచి వారు ఏకాదశి నాడు ఉపవాసం చేయాలని అంటారు. ఈ ఉపవాస వ్రతానికి కొన్ని సడలింపులు కూడా సూచించారు. దశమి నాడు రాత్రే రేపు ఏకాదశి అని సంకల్పం చేసుకుని ఉపవాసం చేయాలి. మరునాడు ఉదయమే స్నానం చేసి శ్రీమనారాయణుడ్ని పూజించి ఇంట్లో చిత్రపటం ముందు దీపాలు వెలిగించి భగవద్గీత, విష్ణు సహస్రనామ స్త్రోతం , విష్ణుపురాణం, భాగవతం ఇలా విష్ణు సంబంధిత పురాణాలు చదువుకుంటా కాలం గడపాలి. ఏకాదశి ఉదయం ,సాయంత్రం కూడా భోజనం స్వీకరించకూడదు. మరునాడు అంటే ద్వాదశి ఉదయం స్నానం చేసి పూజ చేసి దీపాలు వెలిగించి వంటకాలు వండి స్వామికి నివేదించి ఒక అతిథితో కూర్చుని భోజనం చేయాలి. ఒక్కరు మాత్రమే భోజనం చేయకూడదు.


ద్వాదశి రోజు రాత్రి కూడా ఉపవాసం చేయాలి. పాలు లాంటివి తీసుకోవచ్చు. దశమి రాత్రి, ఏకాదశి రాత్రి, ద్వాదశి రాత్రి ఇలా మూడు రోజుల్లో నాలుగు పూటల భోజనం చేయకుండా ఉండటం ఏకాదశి ఉపవాస వ్రతం. భౌతికంగా ఆలోచిస్తే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు 180 డిగ్రీల నుంచి ఒక బిందువు చొప్పున 360 డిగ్రీల వృత్తంలో ఏకాదశి తిథి నాటికి 120 డిగ్రీల నుంచి 130 డిగ్రీల ప్రమాణం మన ఉదరంపైన ప్రసరిస్తూ ఉంటుంది. అది శూన్య కిరణ కాంతిని గణన చేసే విధానం. ఇది ఆధునిక వైద్య పద్ధతి కూడా. ఈ దేహమంతా 180 డిగ్రీలు అనుకుంటే 120 నుంచి 130 ఏకాదశి తిథి నాటికి కాంతి పుంజములు మన పొట్టపైన ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒంటిలో ఆహారం లేకపోతే శక్తి అంతా దేహమంతా వ్యాపించి చక్కని శక్తిని, కాంతిని అందిస్తుంది.

ఈవిషయాన్ని నేటి శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. అందుకే లంకణం పరమ ఔషధం అని కూడా అంటారు. ఉపవాసం అంటే ఆహారాన్ని స్వీకరించకుండా శ్రీమన్నారాయణుడ్ని తలుచుకోవడం. కాని ఈరోజుల్లో అలా చేయడం కష్టమే. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు పాలు , పండ్లు, లేదా పంచామృతం ఒకసారి మాత్రమే తీసుకుని ఉపవాసం చేయచ్చు . పెసరపప్పు, బియ్యం కలిపిన వంటకం గంజి వార్చకుండా ఒకసారి మాత్రమే తిన ఉపవాసం చేయవచ్చని వాయు పురాణం చెబుతోంది.

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×