BigTV English

Snowstorm : మంచుతుపాను విధ్వంసం.. గడ్డకట్టిన నయాగరా జలపాతం..

Snowstorm : మంచుతుపాను విధ్వంసం.. గడ్డకట్టిన నయాగరా జలపాతం..

Snowstorm : మంచు తుపాను ధాటికి అమెరికా విలవిలలాడుతోంది. ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఈ శతాబ్దంలో కెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాను అగ్రరాజ్యంలో పెను విధ్వంసం సృష్టించింది. మంచులో కూరుకుపోయిన కార్లలో ప్రాణాలుకోల్పోయిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించేందుకు, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది.


పశ్చిమ న్యూయార్క్‌లో భారీగా మంచు కురిసింది. బఫెలో నగరం మంచులో కూరుకుపోయింది. ఇక్కడ క్రిస్మస్‌ ముందు మొదలైన హిమపాతం.. ఆ తర్వాత తీవ్ర రూపం దాల్చింది. రహదారులపై 50 అంగుళాలపైనే మంచు పేరుకుపోయింది. చాలా చోట్ల కార్లలో, మంచు దిబ్బల్లో ఇరుక్కుపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ న్యూయార్క్‌లో మంచు తుపాను ధాటికి 30 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆండెల్‌ టేలర్‌ అనే 22 ఏళ్ల యువతి బఫెలోలో ఒక కారులో చిక్కుకుపోయి దాదాపు 18 గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్టు చేసింది. దీనిలో ఆమె కారు పూర్తిగా మంచులో కూరుకుపోయినట్లు కనిపించింది. బఫెలో ప్రాంతంలో 1977లో వచ్చిన మంచు తుపాను కంటే ఇది మరింత తీవ్రమైనదిగా భావిస్తున్నారు.

గడ్డకట్టిన నయాగరా
అమెరికాలో ఇటీవల ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టింది. ఈ జలపాతానికి 25 మైళ్ల దూరంలో బఫెలో నగరం ఉంది.


దేశవ్యాప్తంగా వారం రోజులుగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మంగళవారం 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం 3,500 పైగా విమానాలను ముందుగానే రద్దు చేశారు. విమానాశ్రయాలు చిక్కుకుపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్‌ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది.

సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్‌ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు. కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్‌ ప్రకటించింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరచుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పు పొంచిఉంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రకటించింది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×