BigTV English

Google Bard:చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌

Google Bard:చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ బార్డ్‌

Google Bard:సెర్చింజన్ దిగ్గజం గూగుల్… చాట్‌జీపీటీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. బార్డ్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను సిద్ధం చేస్తోంది. లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్‌-LaMDA ఆధారంగా రూపొందించిన ‘బార్డ్’…. అంతరిక్ష ఆవిష్కరణలను కూడా సులభంగా వివరిస్తుందని, ప్రస్తుతానికి టెస్టర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. పరీక్షల తర్వాతే పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు.


క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ‘బార్డ్‌’ వివరిస్తుందని గూగుల్ పేర్కొంది. ఇంట్లోని కూరగాయలతో ఏ వంటకాలు చేసుకోవచ్చు, ఎలాంటి విందు సిద్ధం చేసుకోవచ్చు అనే చిన్న చిన్న చిట్కాలు కూడా బార్డ్‌ అందించగలదని ప్రకటించింది. సృజనాత్మకత, ఉత్సుకతకు బార్డ్‌ ఓ వేదికగా మారుతుందని సుందర్ పిచాయ్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.

గూగుల్ గుత్తాధిపత్యానికి గండికొట్టేలా చాట్‌జీపీటీని విజయవంతం చేయడానికి… దాని మాతృసంస్థ ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. చాట్‌జీపీటీని బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు అనుసంధానించే ప్రయత్నాల్లో ఉండగానే… పోటీగా గూగుల్ ‘బార్డ్‌’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చాట్‌జీపీటీ 2021 వరకు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే యూజర్లకు సమాధానాలిస్తోంది. కానీ, ఆన్‌లైన్‌లోని తాజా సమాచారంతో బార్డ్‌ సమాధానాలిస్తోందని, ఇది అదనపు ప్రయోజనమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ… అమెరికాలో పెయిడ్‌ వెర్షన్‌నూ అందిస్తోంది. కొందరికే అందుబాటులోకి వచ్చిన బార్డ్‌ను… అందరూ ఉపయోగించుకునేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చు.


గత మూడు నెలల నుంచి చాట్‌జీపీటీ భారీ సంఖ్యలో యూజర్లను ఆకర్షించింది. ఎప్పటికైనా అది తీవ్ర పోటీ ఇవ్వొచ్చని భావించిన గూగుల్… బార్డ్‌ అభివృద్ధిని వేగవంతం చేయాలని కృత్రిమ మేధ ఇంజనీర్లకు సూచించింది. అట్లాస్‌ ప్రాజెక్ట్ పేరుతో బార్డ్‌ను గూగుల్‌ తీర్చిదిద్దుతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×