BigTV English

Google:- గూగుల్ కొత్త ఫీచర్.. వద్దనుకుంటే డిలీట్..!

Google:- గూగుల్ కొత్త ఫీచర్.. వద్దనుకుంటే డిలీట్..!

Google:- స్మార్ట్ ఫోన్స్ అనేవి మనుషుల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అని చెప్పడానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. మొదట్లో కేవలం సోషల్ మీడియా యాప్స్ వల్లే యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుంది అనుకున్న వారు కూడా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్ల వల్ల ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని గుర్తించారు. అందుకే గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ ముందుకెళ్తోంది.


ఇప్పటికే గూగుల్ తన ప్రైవసీ పాలసీని ఎప్పటికప్పుడు మారుస్తూ.. యూజర్లను ఆకర్షిస్తోంది. గూగుల్‌కు పోటీగా ఇప్పటికే ఎన్నో సెర్చ్ ఇంజన్లు వచ్చినా కూడా చాలామంది ఇప్పటికీ దీనిపైన ఆధారపడుతున్నారు. అందుకే యూజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం గూగుల్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. చాట్ జీపీటీ అనేది తనకు పోటీగా వస్తుందని గ్రహించిన గూగుల్.. గత రెండు నెలల్లో ఎన్నో కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. అంతే కాకుండా కొత్తగా అప్డేట్ కూడా అయ్యింది. దాంతో పాటు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

త్వరలోనే గూగుల్.. ‘డేటా డిలీషన్ పాలిసీ’ అనే కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇది యూజర్లకు తమ యాప్ డేటాపై పూర్తి హక్కులను అందిస్తుంది. ఇది గూగుల్ యాప్‌లో యూజర్ల అకౌంట్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసే సౌకర్యాన్ని ఇస్తుంది. కేవలం యాప్‌లో మాత్రమే కాదు.. వెబ్‌లో కూడా వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అకౌంట్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు. మామూలుగా కొన్ని యాప్స్ గూగుల్ అకౌంట్ సమాచారాన్ని తీసుకుంటాయి. గూగుల్ ఈ ఫీచర్‌ను యాడ్ చేసిన తర్వాత మనం ఉపయోగించని యాప్స్ నుండి గూగుల్ అకౌంట్ సమాచారాన్ని డిలీట్ చేయవచ్చని గూగుల్ ఉద్యోగులు చెప్తున్నారు.


యూజర్ల చేతిలోనే తమ గూగుల్ అకౌంట్‌కు సంబంధించిన కంట్రోల్ పూర్తిగా ఉండాలని ఈ కొత్త ఫీచర్ లక్ష్యం. ఒకవేళ ఈ ఫీచర్‌ను ఉపయోగించి యూజర్ల తమ అకౌంట్‌ను డిలీట్ చేయాలి అనుకోకపోయినా.. అకౌంట్లోని కొన్ని ప్రత్యేకమైన అంశాలు.. ఉదాహరణకు హిస్టరీ, ఫోటోలు, వీడియోలు లాంటివి కూడా డిలీట్ చేసుకోవచ్చని గూగుల్ అంటోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే దీనిని యూజర్లకు అందిస్తామని గూగుల్ బయటపెట్టింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×