BigTV English

Health Issues due to Virtual Reality : వర్చువల్ రియాలిటీ వల్ల ఆరోగ్య సమస్యలు.. రంగంలోకి ఏఐ..

Health Issues  due to Virtual Reality : వర్చువల్ రియాలిటీ వల్ల ఆరోగ్య సమస్యలు.. రంగంలోకి ఏఐ..
Health Issues  due to Virtual Reality


Health Issues due to Virtual Reality : ఈరోజుల్లో మనిషి.. బయట ప్రపంచంలో కంటే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో, ఇంటర్నెట్ ప్రపంచంలో జీవించడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. స్మార్ట్ ఫోన్ లేకుండా ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది లేకుండా అసలు ఉండలేని పరిస్థితికి వచ్చేశాడు. అసలు ఫోన్ లేకపోతే ప్రపంచం అంతా తలకిందులు అయిపోయినట్టుగా చేస్తారు కొందరు. దానినే సైబర్ సిక్‌నెస్ అంటారు. దీనిని కనిపెట్టడం కోసం ఇప్పటివరకు ప్రత్యేకంగా టెక్నాలజీలు ఏమీ లేవు. తాజాగా ఏఐతో దీనిని కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది ఎన్నో విధాలుగా మనుషుల సమస్యలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెడికల్ రంగంలో కూడా ఏఐను ఉపయోగించడానికి వైద్యులు ముందుకొస్తున్నారు. ఒక్క మెడికల్ రంగంలోనే కాదు.. మరెన్నో రంగాల్లో కూడా ఏఐ తన సత్తాను చాటుకుంటోంది. తాజాగా వర్చువల్ రియాలిటీ (వీఆర్)‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనుషుల్లో ఏర్పడే వికారం, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటివి కనిపెట్టడానికి కూడా ఏఐ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.


వర్చువల్ రియాలిటీ అనేది మనుషులను నిజ జీవితం నుండి చాలా దూరంగా తీసుకెళ్లి అక్కడ వదిలేస్తుంది. వీఆర్‌తో సాన్నిహిత్యం అలవాటయిన వారికి బయట ప్రపంచంలోకి రావాలని అనిపించదు. కానీ వీఆర్‌లోనే ఎక్కువసేపు ఉండడం వల్ల వారికి సైబర్ సిక్‌నెస్ అనేది ఏర్పడుతుంది. దాని వల్లే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి కనిపెట్టడానికి ఏఐ ముందుకొచ్చింది. వీఆర్ అనేది చాలామందిని సైబర్ సిక్‌నెస్‌కు గురిచేస్తుంది. కానీ కొందరు దీనిని మోతాదులో ఉపయోగించడంతో వారికి ఎలాంటి సమస్యలు ఉండవు.

వీఆర్‌ను ఉపయోగిస్తున్న వారిని రెండు గ్రూపులుగా విభజించి ఏఐతో పరీక్షలు నిర్వహించి చూశారు శాస్త్రవేత్తలు. అయితే అందులో వీఆర్ వల్ల సమస్యలు ఎదుర్కంటున్న వారిని 93 శాతం కరెక్ట్‌గా గుర్తుపట్టింది ఏఐ. వీఆర్‌ను అనుభూతి చెందిన తర్వాత చాలామంది అనారోగ్యానికి గురయినట్టు ఫీల్ అవుతున్నారని ఏఐ బయటపెట్టింది. ఏఐ చేసిన పరీక్షలు, ఇచ్చిన రిజల్ట్‌ను బట్టి వీఆర్ సంస్థలు కూడా తమ ప్రొడక్ట్స్ వల్ల కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చూసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఒకవేళ అలా చేయకపోతే సైబర్ సిక్‌నెస్ అనేది కూడా ఒక మహమ్మారిగా మారే అవకాశం ఉందన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×