BigTV English

Manoj Bajpayee : ‘రాయ‌ల‌సీమ రుచులు’లో ఫుడ్ అంటే ఇష్టం

Manoj Bajpayee : ‘రాయ‌ల‌సీమ రుచులు’లో ఫుడ్ అంటే ఇష్టం
Manoj Bajpayee

Manoj Bajpayee : బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైద‌రాబాద్ వచ్చారు. ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పారు. హైద‌రాబాద్ బిర్యానీ అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన ఆయ‌న‌. రాయ‌ల‌సీమ రుచులు హోట‌ల్‌లోని తిండిని ఇష్ట‌ప‌డ‌తాన‌ని అన్నారు. అందుకు కార‌ణం. తాను స్పైసీ ఫుడ్‌ను బాగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని ఆయ‌న అన్నారు. అలాగే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమా ఏ టాలీవుడ్ హీరోకి స‌రిపోతుంద‌ని భావిస్తున్నార‌ని అడ‌గ్గా.. అంద‌రి హీరోల‌తో మంచి అనుబంధం ఉంది. ప‌ర్టికుల‌ర్‌గా ఈ పాత్ర అయితే మ‌హేష్‌కు స‌రిపోతుంద‌ని భావిస్తున్నా అని అన్నారు వెర్స‌టైల్ ఆర్టిస్ట్ మ‌నోజ్ బాజ్‌పాయ్‌.


ఇంకా మ‌నోజ్ బాజ్‌పాయి మాట్లాడుతూ ‘‘మా డైరెక్ట‌ర్ అపూర్వ‌సింగ్ క‌ర్కి అయితే క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ కోస‌మైతే మూడు నాలుగు కెమెరాలు పెట్టారు. సింగిల్ టేక్‌లో ఏడు పేజీలున్న మోనోలాగ్‌ను కంప్లీట్ చేయాల‌ని నాతో అన్నారు. అందుకోసం నాకు రెండు రోజుల స‌మయం కూడా ఇచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే సింగిల్ టేక్‌లో పూర్తి చేయాల‌నుకుని నేను వాటిని నేర్చుకుని రెండు రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేసి చేశాను. ఇప్పుడు చూస్తుంటే వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది.

ఈ చిత్రంలో నేను చేసిన సోలం అనే లాయ‌ర్ పాత్ర కామ‌న్ మ్యాన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అందుక‌నే ఆ పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలున్నప్ప‌టికీ దాన్ని చిరున‌వ్వుతో ఎదుర్కొనే సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లంద‌రికీ ఈ పాత్ర ఓ ఉదాహ‌ర‌ణ‌.


సోలంకి పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. అందుక‌నే మంచి అప్రిషియేష‌న్స్ వ‌స్తున్నాయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కాన్సెప్ట్‌ను మ‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌లు నిజ ఘ‌ట‌న‌ల‌ల‌ను ఆధారంగా త‌యారు చేశాం. అయితే ప్ర‌ధానంగా ఈ సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె త‌న జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను చూపించాం. అలాగే ఆమెకు, సోలంకితో ఉన్న ఓ మంచి అనుబంధాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశాం’’ అన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×