E-Paper
Advertisement

Telescope Captures Image : అద్భుతమైన స్పైరల్ గెలాక్సీని ఫొటో తీసిన హబుల్ టెలిస్కోప్

Telescope Captures Image : అద్భుతమైన స్పైరల్ గెలాక్సీని ఫొటో తీసిన హబుల్ టెలిస్కోప్
Advertisement

Telescope Captures Image : విశ్వంలో అద్భుతాలకు కొదవలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ అవన్నీ ఒక్కొక్కటిగా మన కళ్లముందుకొస్తున్నాయి. అలాంటిదే అద్భుతమైన స్పైరల్ గెలాక్సీ. దీన్ని అంతే అందంగా ఫొటో తీసింది హబుల్ స్పేస్ టెలిస్కోప్. పాలపుంతలోని నక్షత్రాలన్నీ మిలమిలా మెరిసిపోతున్నాయి. మరోరకంగా చెప్పాలంటే ఇది దీపావళి రోజున భూచక్రం తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
ఎన్.జి.సి.-5495 అనే గెలాక్సీకి సంబంధించిన ఈ చిత్రాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సెప్టెంబర్ 26నే రిలీజ్ చేసింది. అయితే ఈ ఫొటో తాజాగా వైరల్ అయింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం పాలపుంతల్లో 60 శాతం గోళాకారంలో ఉన్నవే. అంటే విశ్వంలో ఉన్న నక్షత్రాల్లో చాలావరకు ఈ గెలాక్సీల్లోనే దర్శనమిస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఈ ఏజెన్సీ విడుదల చేసిన ఎన్.జి.సి.5495 గెలాక్సీ అనేది భూమికి 300 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
సాధారణంగా గెలాక్సీల మధ్యలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటాయి. వీటి ద్వారా శక్తి ఉత్పాదకత జరుగుతుందంటారు సైంటిస్టులు.
ఎన్.జి.సి-5495 పాలపుంతలో రెండు ఇంటర్ పోల్స్ కనిపిస్తాయి. ఒకటి మధ్య భాగంలో కొంచెం బయటివైపు. మరోటి
గెలాక్సీని ఆనుకుని ఉంటుంది. ఈ ఫొటోని ఇంత అద్భుతంగా క్లిక్ మనిపించింది హబుల్ స్పేస్ టెలిస్కోప్ కు చెందిన వైడ్ ఫీల్డ్ కెమెరా 3. గెలాక్సీ ముందరి భాగాన్ని… దాని అంచులదాకా ఫొటో తీసి పంపించింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ 30 ఏళ్ల క్రితం అందుబాటులోకి వచ్చింది. ఇది అమెరికాకు చెందిన నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జాయింట్ ప్రాజెక్ట్. ఈ అద్భుత, అపురూప చిత్రం అందరినీ భలే ఆకట్టుకుంటోంది.
సాధారణంగా పాలపుంతను రాత్రివేళ మనం కంటితో చూడొచ్చు. కొన్నిసార్లు అది భూమికి దగ్గరగా కనిపిస్తుంది. నక్షత్రాలన్నీ ఒక్కదగ్గరికి చేరి పాలవలే తెల్లగా మెరిసిపోతుంటాయి. దాన్ని కాసేపు తదేకంగా చూస్తే అచ్చు ఈ ఫొటోలో కనిపించినట్లే అనిపిస్తుంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×