Big Stories

Instagram : ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఇక డబ్బులు సంపాదించొచ్చు.. అసభ్యకర పోస్టులకు చెక్ పెట్టొచ్చు

Instagram : సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు కేవలం సమాచారాన్ని అందించడం, యూజర్లు అభిప్రాయాలు వ్యక్తం చేయడానికే పరిమితం కావడం లేదు. డబ్బులు సంపాదించి పెట్టే ఆదాయ మార్గంగా కూడా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడీ లిస్టులో ఇన్ స్టాగ్రామ్ కూడా చేరుతోంది. రీల్స్, స్పెషల్ పేజీలతో ఇప్పటికే ఫేస్ బుక్ లో ఆదాయం పొందుతున్నవారు చాలామందే ఉన్నారు. ఇక కంటెంట్ క్రియేటర్లకు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ గుడ్ న్యూస్ చెప్పింది. డబ్బులు సంపాదించి పెట్టే మోనెటైజేషన్ ఫీచర్ ని తీసుకురావడానికి టెస్ట్ చేస్తోంది మెటా. ఇది అందుబాటులోకి వస్తే క్రియేటర్స్ ఇన్ స్టాగ్రామ్ లో నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ని అమ్మడం, కొనడం వంటివి చేయొచ్చు. ఈ నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అనేవి క్రిప్టో కరెన్సీలో భాగం అని చెప్పాలి. క్రిప్టో కరెన్సీ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
మరి నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా వేటిని పరిగణిస్తారు? నిజానికి దీనిపై మెటా నుంచి పూర్తి క్లారిటీ రావల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రచారం అరుదైన ఫొటోలు, అపురూపమైన పెయింటింగ్స్, ఇతర చారిత్రక ప్రాధాన్యత ఉన్న వస్తువులను సెల్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ టిక్ టాక్ లోని కాయిన్స్, గిఫ్ట్స్ మోనెటైజేషన్ ఫీచర్ ని పోలివుంటుందంటున్నారు నిపుణులు.
మరోవైపు అసభ్యకర పోస్టులను, అభ్యంతరకర పోస్టులకు చెక్ పెట్టేలా కొత్త ఫీచర్లను ఇన్ స్టాగ్రామ్ తీసుకొచ్చింది. బ్లాకింగ్, హిడెన్ వర్డ్స్ వంటి అసభ్యకర పోస్టులను అడ్డుకుని యూజర్ల గౌరవానికి భంగం కలుగకుండా చూడడమే తమ ఉద్దేశమని మెటా ప్రకటించింది. పదే పదే అసభ్యకర, అభ్యంతరకర, జుగుప్సాకర పోస్టులు పెట్టేవారి అకౌంట్లు ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తుంది ఈ కొత్త ఫీచర్. అంతేకాదు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కుదరదు. అశ్లీల పోస్టులు ఎవరైనా పెడితే… ఆ యూజర్ కు తెలియకుండానే… అతడిని లేదా ఆమెను ఫాలో కావద్దు అంటూ హిడెన్ మెసేజ్ లు వెళ్తాయి.
మరోవిషయం ఏంటంటే తెలుగు భాషను సపోర్ట్ చేసేలా ఇన్ స్టాగ్రామ్ ఫీచర్ తెచ్చింది. దీంతోపాటు
తమిళ్, మరాఠీ, బెంగాలీ, రష్యన్, టర్కిష్, ఫార్సీ భాషలను ఈ కొత్త ఫీచర్ సపోర్ట్ చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News