Twitter Down : మొన్న వాట్సాప్.. నిన్న ఇన్స్‌టాగ్రాం.. ఈ రోజు ట్విట్టర్.. వీటిలో లాగిన్ అవ్వడానికి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి వీటిలో సాంకేతిక సమస్య రావడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వాట్సాప్ ఒక్కసారిగా డౌన్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ మెసేజ్‌లు ఫార్వర్డ్ కాకుండా ఆగిపోయాయి. ఈ సమస్య పరిష్కారం కావడానికి కొన్ని గంటలు పట్టింది.
కొన్ని రోజుల ముందు ఇన్స్‌టాగ్రామ్‌లో లాగిన్ సమస్య ఎదురైంది. ఫర్గాట్ పాస్వర్డ్ ట్రైచేసి.. అనేక రకాలు ప్రయత్నించా యూజర్లకు నిరాశే ఎదురైంది. సోషల్ మీడియా వాడకం పెరగడం.. సర్వర్లపై భారం పడటం వల్ల ఇలాంటి సమస్య తెలత్తి ఉండవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.
ఈ రోజు పట్టపగలు 3 గంటల నుంచి ట్విట్టర్లో లాగిన్ సమస్యలు ఎదురయ్యాయి. ఉదయం 6 దాటే సరికి ఈ సమస్య మరింత పెరిగింది. అయితే కొంత సమస్యం తరువాత నార్మల్ స్థితికి వచ్చింది. ట్విట్టర్‌ను ఇటీవల ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న తరువాత.. ట్విట్టర్లో భారీ మార్పులు జరిగాయి. ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ చేర్చడానికి చార్జీలను వసూలు చేస్తున్నారు. గతంలో నడిపిన ఫేక్ ఖాతాలు ఏరివేయడం ప్రారంభించారు. భారం అనుకున్న ట్విట్టర్ ఎంప్లాయిస్‌ను ఇంటికి పంపిచ్చేస్తున్నారు ఎలాన్ మస్క్.