E-Paper
Advertisement

Husband-wife : పుణ్యక్షేత్రాలను భార్యాభర్తలు కలిసే దర్శించాలా…

Husband-wife : పుణ్యక్షేత్రాలను భార్యాభర్తలు కలిసే దర్శించాలా…
Advertisement

Husband-wife : భార్య భర్తలో సగం, భర్తలో భార్య సగం. ఇద్దరు కలిసి ఉంటూనే అందం, ఆనందం. అది ఏ సందర్భంలోనైనా…సరే .యాగాలు చేసిన‌ప్పుడు, దేవాల‌యాల‌ను సంద‌ర్శించిన‌ప్పుడు దంప‌తులిద్దరూ క‌లిసే చేయాల‌ని హిందూ పురాణాలు చెబుతున్నాయి. దంప‌తులిద్ద‌రూ ఒక‌రి శ‌రీరంలో మ‌రొక‌రు స‌గ‌భాగం అంటారు. అందుకు ప‌ర‌మ‌శివున్ని అర్థ‌నారీశ్వ‌రుని రూపంలో కొలుస్తారు. ఈ క్ర‌మంలో వారు క‌ష్ట సుఖాల్లోనూ కాదు, పూజ‌లు చేసిన‌ప్పుడు, ఆల‌యాల వంటి పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లిన‌ప్పుడు కలిసే ఆ ప‌నులు చేస్తే దాంతో ఆ ఫ‌లితం ఇద్ద‌రికీ క‌లుగుతుంద‌ట‌.

కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో చాలా మంది రాజులు త‌మ భార్య‌లు ప‌క్క‌న లేనప్పుడు వారికి చెందిన బంగారు విగ్రహాల‌తో పూజ‌లు చేసే వారు క‌దా. అలాగే ఇప్పుడు కూడా భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ చేయాల‌ట‌. దాంతో ఆ యాగ ఫ‌లితం సంపూర్ణంగా వారికి ద‌క్కుతుంద‌ట‌. ఇతర ఏ మతాల్లో లేని విధంగా హిందూమతంలో స్త్రీని శ‌క్తితో పోల్చారు. శ‌క్తి రూపంలో ఉండే స్త్రీ ప‌క్క‌న ఉండ‌గా పూజ చేస్తే ఆ పురుషునికి అన్నింటా విజ‌యం సిద్దిస్తుంద‌ట‌. అందుకే దంప‌తులిద్ద‌రూ క‌ల‌సి పూజ‌లు చేయాల‌ని, దేవాల‌యాల‌ను ద‌ర్శించాల‌ని చెబుతారు.

Advertisement

సీతా వియోగం తర్వాత చేపట్టిన అశ్వమేథయాగాన్ని రాముడు సీతమ్మ బంగారు విగ్రహంతోనే నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. పెళ్లి చేసుకున్న‌ప్పుడు దంప‌తులిద్ద‌రూ అన్ని విష‌యాల్లోనూ సమానంగా పాలు పంచుకుంటామ‌ని పంచ భూతాల సాక్షిగా ప్ర‌మాణం చేస్తారు.పుణ్యక్షేత్రాల సంద‌ర్శ‌న‌, పూజ‌లు చేసిన‌ప్పుడు కూడా భార్య‌భర్త‌లిద్ద‌రూ పాల్గొంటేనే అది ప‌రిపూర్ణం అయి ఫ‌లితం ద‌క్కుతుంది. లేదంటే సగం ఫలితమే పొందాల్సి ఉంటుంది. ఎవరి పుణ్యం వారిదే , ఎవరి పాపం వారిదేనంటారు అందుకే. భార్య పూజలు చేస్తే ఆమెకే ఫలితం దక్కుతుంది భర్తకు రాదు. భార్య చేసే పనుల్లో ఒక చేయి వస్తే ఫలితాలు ఇద్దరికి కలిపి వస్తాయని పెద్దలు చెబుతుంటారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×