BigTV English

Chinese coins significance : చైనా వాస్తును మనం ఫాలో కావచ్చా….

Chinese coins significance : చైనా వాస్తును మనం ఫాలో కావచ్చా….

Chinese coins significance : భారతదేశంలో మాదిరిగానే చైనాలో వాస్తును బాగానే నమ్ముతుంటారు. మన ఆచారాలను పోలినవి ఎన్నో కనిపిస్తుంటాయి. ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం మ‌న‌కు మార్కెట్‌లో ఫెంగ్ షుయ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి భిన్న రకాలుగా ఉంటాయి. వాటిలో ఏ నాణేల‌ను అయినా స‌రే కొని తెచ్చి ముందుగా ఉప్పు నీటితో శుభ్రం చేయాలి. దీంతో వాటిపై ఉండే నెగెటివ్ ప్ర‌భావం పోతుంది. త‌రువాత ఆ కాయిన్స్‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ప‌లు భిన్న ప్ర‌దేశాల్లో ఉంచ‌డం వ‌ల్ల భిన్న‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఇంట్లో ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌కు ఎరుపు రంగు దారం క‌ట్టి వేలాడ‌దీయాలి. ఆరు అంగుళాలు, కానీ మూడు అంగుళాలు కాయిన్స్ తీసుకుంటే సరిపోతుంది. దీంతో ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ రాదు. ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దీంతో ఇంట్లో ఉండే అంద‌రికీ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. క‌ష్టాలు త‌ప్పుతాయి.


ఈకాయిన్స్ వేలాడ దీసే ముందు మన ఇష్ట దైవం ముందు పూజ చేయాలి. ధనయోగం కలిగించాలని ప్రార్ధించాలి. ఈ కాయిన్ మెటల్ తో తయారు చేయబడి ఉంటుంది. కాయిన్ మీద 12 రాశుల సింబల్స్ చైనా భాషలో ఉంటాయి. మన ఇంటికి అన్ని రాశుల వారు రకరకాల జాతకులు వచ్చి వెళ్తుంటారు. అలా వచ్చే వాళ్లతో ఒక్కోసారి నష్టజాతకుల వల్ల మనకు కొంతనష్టం జరుగుతుంది. పాజిటివ్ కంటే నెగిటివ్ జాతకలు ఇంటికి ఎక్కువుగా వచ్చి వెళ్తుంటే వారి ప్రభావం కచ్చితంగా ఇంటిపైన పడుతుంది. ఇలాంటి వాటిని బయటపడేందుకు ఫెంగ్ షుయ్ కాయిన్స్ ఉపయోగపడతాయి.

ధ‌నం ఉంచే చోట లేదా మ‌హిళ‌లు హ్యాండ్ బ్యాగుల్లో, పురుషులు ప‌ర్సుల్లో ఒక ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచుకోవాలి. దీంతో వారు ధ‌నం బాగా సంపాదిస్తారు. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఏ ప‌ని చేసినా ఆటంకం లేకుండా స‌జావుగా పూర్త‌వుతుంది. అన్ని విధాలుగా అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. ధ‌న‌వంతులు అవుతారు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వ్యాపారులు అయితే త‌మ కార్యాల‌యాల్లో లేదా ప‌నిచేసే చోట‌, ఉద్యోగులు అయితే త‌మ డెస్క్ వ‌ద్ద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారు ఆయా రంగాల్లో రాణిస్తారు. వ్యాపారుల‌కు వ్యాపారంలో క‌ల‌సి వ‌స్తుంది. లాభాలు సంపాదిస్తారు . దంప‌తులు ఇంట్లో బెడ్ రూమ్‌లో ఏదైనా షెల్ఫ్‌లో లేదా టేబుల్ మీద ఫెంగ్ షుయ్ కాయిన్‌ను ఉంచాలి. దీంతో వారి మ‌ధ్య ఉండే క‌ల‌హాలు, గొడ‌వ‌లు త‌గ్గుతాయి. వారి దాంప‌త్యం అన్యోన్యంగా సాగుతుంది


Tags

Related News

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Big Stories

×