E-Paper
Advertisement

Gold Fish : గోల్డ్ ఫిష్ సెంటిమెంట్ లో నిజముందా..

Gold Fish : గోల్డ్ ఫిష్ సెంటిమెంట్ లో నిజముందా..

Gold Fish : కొందరి ఇళ్లల్లో రంగు రంగుల చేపలతో ఉన్న అక్వేరియంలు కనిపిస్తాయి. ఇంటిలోపలకు ప్రవేశించగానే కనిపించే విధంగా వీటిని పెట్టుకుంటారు. కొన్ని రంగుల చేపల్ని పెంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకంతో అలా చేస్తుంటారు. గోల్డ్ ఫిష్ వాస్తు శాస్త్రంలో అదృష్ట చేపగా కూడా పరిగణిస్తుంటారు. గోల్డ్ కలర్ చేపలు ఇంటికి అందాన్ని ఇవ్వడంతో పాటు సామరస్యాన్ని సూచిస్తాయి. కాబట్టి ఈ అదృష్ట చేపను ఇంట్లో అక్వేరియంలో ఉంచడం అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతుంటారు.

ఇంటి అదృష్టాన్ని పెంచడంలో గోల్డ్ ఫిష్ చాలా సహాయపడుతుంది. ఇంటి డ్రాయింగ్ రూమ్‌కి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉన్న చిన్న అక్వేరియంలో గోల్డ్ ఫిష్‌ను ఉంచవచ్చు. వాస్తు ప్రకారం చేపలతో ఉన్న అక్వేరియం ఇంటిని సంపదతో నింపుతుందట. ఈ అక్వేరియంలో అరోవానా చేప ఉంచితే పవిత్రమైనదిగా భావిస్తుంటారు. చేపలు ఈత కొట్టడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుందని… ఇంట్లో చిన్న అక్వేరియంలో చేపల పెంపకం అదృష్టాన్ని పెంచుతుందని విశ్వసిస్తుంటారు. అయితే ఆక్వేరియంను సరైన దిశలో ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉత్తర వాయువ్యంలో అక్వేరియం పెట్టుకుంటనే అపారమైన ధన సంపదతో గృహాన్ని నింపుతుంది.

అయితే గోల్డ్ ఫిష్ లు పెంచుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చేపలు త్వరగా చనిపోకుండా ఎక్కువకాలం ఉంటాయి . గోల్డ్ ఫిష్ లు పెంచుకునే ముందు అక్వేరియంలో ఫిల్టరేషన్ కిట్ తీసుకోవాలి. మూడు రోజులపాటు చేపలు లేకుండానే రన్ చేయాలి. పిష్ పుడ్ కూడా వేయాలి. పది రోజులపాటు చేసినా పర్వాలేదు. అంతే కాని వెంటనే చేపల్ని తీసుకొచ్చి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల చేపలకు అనుకూలమైన బ్యాక్టిరియా అక్కడ ఫామ్ అవుతుంది. ఫిష్ హెల్తీగా ఉండటానికి అది ఉపయోగపడుతుంది. అలాగే నీళ్లల్లో యాంటీ క్లోరిన్ వేయాలి. గోల్డ్ ఫిష్ లాంటివి బౌల్స్ లో ఉంచకూడదు.

గోల్డ్ ఫిష్ లకు ఎప్పుటూ ఎక్కువ స్పేస్ ఉండాలి. ఇవి ఎక్కువ వేస్ట్ ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దీని వల్ల అమోనియం ఫామ్ అవుతుంది. చిన్న ట్యాంకుల్లో అయితే అది ఎక్కువ ఫామ్ అవుతుంది. దీనివల్ల చేపలు త్వరగా నీరసించిపోతు చనిపోతుంటాయి. 2, 3 అడుగుల ట్యాంకులో నాలుగు చిన్న వాటిని పెంచుకోవచ్చు. ఇందులో వాటర్ ఫిల్టరేషన్ చేసే ఏర్పాట్లు ట్యాంక్ వాటర్ కెపాసిటీకి వంద రెట్లు ఉండాలి.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×