Big Stories

Hyundai Aura car : ‘ఆరా’ కొత్త వెర్షన్.. ధర ఎంతంటే?

Hyundai Aura car : బడా కార్ల తయారీ సంస్థ హ్యుండయ్‌… కాంపాక్ట్‌ సెడాన్‌ కారు ‘ఆరా’లో కొత్త వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది. ముందుభాగంలో ఎక్కువ మార్పులు చేస్తూ… కొత్త ‘ఆరా’ను తీర్చిదిద్దారు. రీ డిజైన్‌లో భాగంగా రేడియేటర్‌ గ్రిల్‌ను నలుపు రంగులో ఇచ్చారు. ముందు బంపర్‌పై ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ అమర్చారు. ఇక వెనుక భాగంలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. దీని ఎక్స్ షోరూమ్ ధరలు రూ.6.29 లక్షల నుంచి 8.87 లక్షలుగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

- Advertisement -

కొత్త ‘ఆరా’లో టర్బో-పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్ల బదులు… 1.2 లీటర్‌ కప్పా పెట్రోల్‌ ఇంజిన్‌, 1.2 లీటర్‌ సీఎన్‌జీ, పెట్రోల్‌ బై ఫ్యుయల్‌ ఇంజిన్‌ అమర్చారు. 1.2 లీటర్‌ కప్పా పెట్రోల్‌ ఇంజిన్‌ వెర్షన్‌లో 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమేటిక్‌ వెర్షన్‌ కూడా ఉంది. కొత్త ‘ఆరా’ బుకింగ్‌లను గత నెలలోనే ప్రారంభించింది… హ్యుండయ్. కేవలం రూ. 11 వేలు మాత్రమే చెల్లించి ఆరా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఆరా ఈ, ఆరా ఎస్‌, ఆరా ఎస్‌ఎక్స్‌, ఆరా ఎస్‌ఎక్స్‌+, ఆరా ఎస్‌ఎక్స్‌ ఆప్షనల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ మేనేజ్‌మెంట్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, బర్‌గ్లర్‌ అలారం, ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌ వంటి భద్రతా ఫీచర్లు ఆరాలో ఆకట్టుకునేలా ఉన్నాయి.

- Advertisement -

ఇక కొత్త ఆరా ఇన్నర్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే… ఫుట్‌వెల్‌ లైటింగ్‌, స్టీరింగ్‌ వీల్‌, లెదర్ కవర్ గేర్‌ నాబ్‌, టైప్‌-సీ ఫాస్ట్‌ యూఎస్‌బీ ఛార్జర్‌, కొత్త ఎంఐడీతో కూడిన 3.5 అంగుళాల స్పీడో మీటర్‌, 8 అంగుళాల స్క్రీన్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో- కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, పుష్‌ బటన్‌, స్టార్ట్‌/స్టాప్‌, క్రూజ్‌ కంట్రోల్‌తో కూడిన స్మార్ట్‌ కీని కూడా ఆరాతో అందిస్తోంది… హ్యుండయ్. పోలార్‌ వైట్‌, టైటాన్‌ గ్రే, టైఫూన్‌ సిల్వర్‌, స్టారీ నైట్‌, టీల్‌ బ్లూ, ఫియరీ రెడ్‌… ఇలా మొత్తం ఆరు రంగుల్లో ఆరా అందుబాటులో ఉంది.

Follow this link for more updates:- Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News